Telugu Global
Cinema & Entertainment

వచ్చే నెల నుంచి రామ్ చరణ్ పరుగులు

సోదరి వివాహం కారణంగా ప్రస్తుతం తన కొత్త సినిమాకు గ్యాప్  ఇచ్చాడు రామ్ చరణ్. అయినప్పటికీ ఒక షెడ్యూల్ పూర్తిచేశాడు. తమిళనాడు హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చెర్రీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి వారం రోజుల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. వచ్చేనెల 10 నుంచి ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంబమౌతుంది. చెర్రీ వచ్చేనెల 14 నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. […]

వచ్చే నెల నుంచి రామ్ చరణ్ పరుగులు
X
సోదరి వివాహం కారణంగా ప్రస్తుతం తన కొత్త సినిమాకు గ్యాప్ ఇచ్చాడు రామ్ చరణ్. అయినప్పటికీ ఒక షెడ్యూల్ పూర్తిచేశాడు. తమిళనాడు హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చెర్రీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి వారం రోజుల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. వచ్చేనెల 10 నుంచి ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంబమౌతుంది. చెర్రీ వచ్చేనెల 14 నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అప్పట్నుంచి మార్చి 21 వరకు ఏకథాటిగా ఈ షూటింగ్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీని ధ్రువ అనే టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే అది అధికారిక టైటిల్ కాదు. త్వరలోనే సినిమా టైటిల్ ను ప్రకటిస్తారు.
బ్రూస్ లీ సినిమా తర్వాత చరణ్ సరసన మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో అరవింద్ స్వామి… తెలుగుతెరపై మెరవబోతున్నాడు. అది కూడా విలన్ గా కనిపించి మెప్పించనున్నాడు. ఆగస్ట్ 12న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
First Published:  27 Feb 2016 10:40 PM GMT
Next Story