Telugu Global
Cinema & Entertainment

సరైనోడు విడుదలయ్యేది అప్పుడే...

బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8. కాబట్టి ఆ రోజున తన కొత్త సినిమా సరైనోడును విడుదల చేద్దామని అల్లువారబ్బాయ్ భావించాడు. కానీ ఆ తేదీని పవన్ కల్యాణ్ లాక్ చేశాడు. తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ను ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్టు పదేపదే ప్రకటిస్తున్నాడు పవన్. దీంతో బన్నీ-పవన్ ల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అంతా స్టార్టింగ్ లో అనుకున్నప్పటికీ… బన్నీ మాత్రం ఫస్ట్ నుంచి సైడైపోవడానికే ఫిక్స్ అయ్యాడు. తాజాగా […]

సరైనోడు విడుదలయ్యేది అప్పుడే...
X
బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8. కాబట్టి ఆ రోజున తన కొత్త సినిమా సరైనోడును విడుదల చేద్దామని అల్లువారబ్బాయ్ భావించాడు. కానీ ఆ తేదీని పవన్ కల్యాణ్ లాక్ చేశాడు. తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ను ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్టు పదేపదే ప్రకటిస్తున్నాడు పవన్. దీంతో బన్నీ-పవన్ ల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అంతా స్టార్టింగ్ లో అనుకున్నప్పటికీ… బన్నీ మాత్రం ఫస్ట్ నుంచి సైడైపోవడానికే ఫిక్స్ అయ్యాడు. తాజాగా తన సినిమాకు సంబంధించి మరో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు బన్నీ. సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చిన రెండు వారాల తర్వాత తన సినిమాను విడుదల చేయానులనుకుంటున్నాడు. దీనికోసం ఏప్రిల్ 22 తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే ఈ తేదీని లాక్ చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
First Published:  27 Feb 2016 10:43 PM GMT
Next Story