ఓడిన వారు సిగ్గుతో బయటకు రాకూడదు- పొగపెడుతున్న భూమా!

ముందువచ్చిన చెవుల కన్నా… వెనుకొచ్చిన కొమ్ములే పవర్ ఫుల్. భూమానాగిరెడ్డి విషయంలోనూ ఇదే రుజువవుతోంది. కష్టకాలంలో టీడీపీని నమ్ముకుని ఉన్న వారికి భూమా వర్గం పొగపెట్టడం మొదలుపెట్టింది. నంద్యాలలో మాజీ మంత్రి ఫరూక్‌ను భూమా కలిసిన వేళ జరిగిన పరిణామాలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.  ఆదివారం ఫరూక్ ఇంటికి వెళ్లిన భూమా ఆయనను అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  ఇద్దరూ కలిసి చర్చించారు. అనంతరం శిల్పా వర్గంపై ఫరూక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వరద పనుల పేరిట నిధులను మింగేశారని ఆరోపించారు.  అంతటితో ఆగలేదు.  భూమాకు మంత్రి పదవి రాదంటూ చెప్పడానికి ఎమ్మెల్సీ (శిల్పాచక్రపాణిరెడ్డి), ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి( శిల్పామోహన్ రెడ్డి) ఎవరని ఫరూక్ ప్రశ్నించారు. ఓడిన వారు సిగ్గుతో బయటకు రాకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు అనుకుంటే భూమాకు మంత్రి పదవే కాదు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వొచ్చు అని అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న వారు నంద్యాల రోడ్ల విస్తరణను పట్టించుకోలేదని విమర్శించారు.  రోడ్ల విస్తరణకు నిధులు అవసరమని, కానీ అక్రమాల తొలగింపుకు నిధులతో ఏం పని అని భూమా ప్రశ్నించారు. తాను నంద్యాలలో పేదలకు 3వేల ఇళ్లను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారని ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయని పరోక్షంగా ప్రత్యర్థులకు భూమా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

భూమా పార్టీలో చేరిన వెంటనే పాత పరిచయాలతో గ్రూపులు కట్టేందుకు ప్రయత్నిస్తుండడంతో కర్నూలు  టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే  శిల్పా కంపెనీకి చెందిన కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలపై వెళ్లాడడాన్ని అడ్డుకునేందుకు భూమా వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. భూమాకు విద్యుత్ శాఖ అప్పగిస్తారని అప్పుడు విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు ఎలా వేస్తారో చూస్తామని ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీలో చేరి వారం కూడా గడవకముందే భూమా ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం వెనుక పార్టీ పెద్దల హస్తం ఉందా… తమకు పొగపెడుతున్నారా అని శిల్పా వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.

Click on image to read:  

jc-diwakar-reddy

polavaram

tdp-leaders-tenali

kcr-grand-children

babu-house-in-vijayawada

devid-raj

devid-raj

bhuma-akhila-priya

jagan-akhilpriya

adhinarayana-reddy

roja-gali

jagan-jc-rahul

roja-anam

pawan

revanth

ysrcp