Telugu Global
Cinema & Entertainment

హ్యాపీ మైండ్... హెల్తీ బాడీ...నాగార్జున‌! 

త‌మిళ స్టార్ సూర్య సంద‌ర్భం వ‌స్తే తెలుగు హీరోల‌ను బాగా పొగిడేస్తుంటాడు. ఇప్పుడు త‌మ్ముడు కార్తీ కూడా నాగార్జున‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.  ఊపిరిలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలంటే అస‌లు న‌చ్చ‌ద‌ని, కానీ ఊపిరి స్క్రిప్ట్ బాగుండ‌టం, నాగార్జున‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం వ‌ల్ల‌నే ఈ సినిమా చేశాన‌ని చెప్పాడు. ఈ సినిమాలో నాగార్జున త‌న‌కంటే చిన్న‌గా క‌నిపిస్తున్నార‌న్నాడు. నాగార్జున‌ చాలా క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న మ‌నిష‌ని, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం […]

హ్యాపీ మైండ్... హెల్తీ బాడీ...నాగార్జున‌! 
X

త‌మిళ స్టార్ సూర్య సంద‌ర్భం వ‌స్తే తెలుగు హీరోల‌ను బాగా పొగిడేస్తుంటాడు. ఇప్పుడు త‌మ్ముడు కార్తీ కూడా నాగార్జున‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఊపిరిలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలంటే అస‌లు న‌చ్చ‌ద‌ని, కానీ ఊపిరి స్క్రిప్ట్ బాగుండ‌టం, నాగార్జున‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం వ‌ల్ల‌నే ఈ సినిమా చేశాన‌ని చెప్పాడు. ఈ సినిమాలో నాగార్జున త‌న‌కంటే చిన్న‌గా క‌నిపిస్తున్నార‌న్నాడు.

నాగార్జున‌ చాలా క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న మ‌నిష‌ని, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తార‌ని, అలాగే ఆహారం విష‌యంలోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటార‌ని, త్వ‌ర‌గా నిద్రపోయి‌, త్వ‌ర‌గా నిద్ర‌లేస్తార‌ని కార్తీ చెప్పుకొచ్చాడు. నాగార్జున‌లోని పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఆయ‌న ఫిట్‌నెస్‌కి ఒక కార‌ణ‌మ‌ని కార్తీ అన్నాడు. హ్యాపీ మైండ్ ఉంటే హెల్తీ బాడీ ఉంటుంద‌న్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌స్తుతంలో, అంటే ఈక్ష‌ణంలో జీవించడం గురించి తాను విని ఉన్నాన‌ని కానీ ఆయ‌న‌లో ఆ ల‌క్ష‌ణాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని అన్నాడు. సెట్‌లో నాగార్జున చాలా ప్ర‌శాంతంగా ఉంటార‌ని, ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం మంచి అనుభూతినిచ్చింద‌ని కార్తీ చెప్పాడు. ఊపిరిని ఫ్రెంచి చిత్రం ఇన్‌ట‌చ్‌బుల్స్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున కాళ్లు చేతులు ప‌నిచేయ‌ని వ్య‌క్తిగా, కార్తీ ఆయ‌న కేర్‌టేక‌ర్‌గా న‌టిస్తున్నారు.

First Published:  29 Feb 2016 3:56 AM GMT
Next Story