Telugu Global
National

త‌మిళ‌నాట అమ్మ‌కు గుడి!

ఇప్ప‌టికే త‌మిళనాడులో  జ‌య‌ల‌లిత‌ అభిమానులు తమ గుండెల్లో గుడి క‌ట్టి ఆమెని పూజిస్తున్నారు. ఇప్పుడు అదే గుడికి నేల‌మీద రూపం ఇస్తున్నాడు ఒక అభిమాని.  అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ ఏడాది చివ‌రిక‌ల్లా గుడిని పూర్తి చేస్తామ‌ని, విరుగంబాక్కం నియోజ‌క‌వ‌ర్గపు ఎమ్‌జిఆర్ యూత్ వింగ్ జాయింట్ సెక్ర‌ట‌రీ ఎపి శ్రీనివాస‌న్ తెలిపాడు. వెల్లూరుకి 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇయేప్పెడు గ్రామంలో ఈ గుడిని నిర్మిస్తున్నారు. చెన్నైలో లాయ‌రుగా ప‌నిచేస్తున్న 37 ఏళ్ల శ్రీనివాస‌న్ జ‌య‌ల‌లిత‌కు వీరాభిమాని. […]

త‌మిళ‌నాట అమ్మ‌కు గుడి!
X

ఇప్ప‌టికే త‌మిళనాడులో జ‌య‌ల‌లిత‌ అభిమానులు తమ గుండెల్లో గుడి క‌ట్టి ఆమెని పూజిస్తున్నారు. ఇప్పుడు అదే గుడికి నేల‌మీద రూపం ఇస్తున్నాడు ఒక అభిమాని. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ ఏడాది చివ‌రిక‌ల్లా గుడిని పూర్తి చేస్తామ‌ని, విరుగంబాక్కం నియోజ‌క‌వ‌ర్గపు ఎమ్‌జిఆర్ యూత్ వింగ్ జాయింట్ సెక్ర‌ట‌రీ ఎపి శ్రీనివాస‌న్ తెలిపాడు. వెల్లూరుకి 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇయేప్పెడు గ్రామంలో ఈ గుడిని నిర్మిస్తున్నారు. చెన్నైలో లాయ‌రుగా ప‌నిచేస్తున్న 37 ఏళ్ల శ్రీనివాస‌న్ జ‌య‌ల‌లిత‌కు వీరాభిమాని. అమ్మ ఆలయం కోసం అత‌ను 2008లో స్థ‌లం కొన్నాడు. 1200 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న ఈ స్థ‌లం విలువ దాదాపు 50 ల‌క్ష‌లు. శ్రీనివాస‌న్‌ ఈ డ‌బ్బు మొత్తాన్ని త‌న కుటుంబం, స్నేహితుల‌నుండి స‌మ‌కూర్చుకున్నాడు. ఇంకా గుడి నిర్మాణం విష‌యంలో త‌న‌తో చేయి క‌ల‌పాల‌నుకున్న‌వారు ముందుకు రావ‌చ్చ‌ని అత‌ను కోరాడు. గుడి నిర్మాణానికి ప్రారంభోత్స‌వం చేసిన అనంత‌రం శ్రీనివాస‌న్ ఈ వివ‌రాలు వెల్ల‌డించాడు. త‌న‌లాంటి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆమె దైవంతో స‌మాన‌మ‌ని, అందుకే త‌న భ‌క్తిని చాటాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు. శ్రీనివాస‌న్ 2004లో జ‌య‌ల‌లిత పార్టీలో చేరాడు.

First Published:  29 Feb 2016 1:05 AM GMT
Next Story