Telugu Global
CRIME

14మంది సొంత కుటుంబ స‌భ్యుల‌ను చంపి... ఆత్మ‌హ‌త్య‌!

త‌ల్లిదండ్రులు, భార్యాపిల్ల‌లు, అక్కాచెల్లెళ్లు, వారి పిల్ల‌లు…ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌లేదు ఆ ఉన్మాది. 14మంది సొంత కుటుంబీకుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ముంబ‌యిలోనే థానేలో ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఘోర ఉదంతం జ‌రిగింది. థానేకు చెందిన హ‌స్నెన్ వారెర్క‌ర్, త‌న‌ కుటుంబం మొత్తాన్ని శ‌నివారం రాత్రి ఒక చోట చేర్చి విందు ఇచ్చాడు. కుటుంబ‌మంతా ఆద‌మ‌ర‌చి నిద్రిస్తున్న‌వేళ అత‌నిలోని రాక్ష‌సుడు మేల్కొన్నాడు. వ‌రుస‌పెట్టి అంద‌రినీ గొంతులుకోసి హ‌తమార్చాడు. త‌రువాత తానూ ఉరివేసుకున్నాడు. కామ‌ర్స్ గ్రాడ్యుయేట్ […]

14మంది సొంత కుటుంబ స‌భ్యుల‌ను చంపి... ఆత్మ‌హ‌త్య‌!
X

త‌ల్లిదండ్రులు, భార్యాపిల్ల‌లు, అక్కాచెల్లెళ్లు, వారి పిల్ల‌లు…ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌లేదు ఆ ఉన్మాది. 14మంది సొంత కుటుంబీకుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ముంబ‌యిలోనే థానేలో ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఘోర ఉదంతం జ‌రిగింది. థానేకు చెందిన హ‌స్నెన్ వారెర్క‌ర్, త‌న‌ కుటుంబం మొత్తాన్ని శ‌నివారం రాత్రి ఒక చోట చేర్చి విందు ఇచ్చాడు. కుటుంబ‌మంతా ఆద‌మ‌ర‌చి నిద్రిస్తున్న‌వేళ అత‌నిలోని రాక్ష‌సుడు మేల్కొన్నాడు. వ‌రుస‌పెట్టి అంద‌రినీ గొంతులుకోసి హ‌తమార్చాడు. త‌రువాత తానూ ఉరివేసుకున్నాడు.

కామ‌ర్స్ గ్రాడ్యుయేట్ అయిన హ‌స్నెన్ నేవీ ముంబ‌యిలోని ఒక సిఎ కంపెనీలో ఇన్‌కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్లు రూపొందించే ఉద్యోగంలో ఉన్నాడు. సంచ‌ల‌నం సృష్టించిన ఈహ‌త్య‌ల వెనుక ఉన్న‌ కార‌ణం ఇంకా తెలియ‌రాలేదు. థానే పోలీస్ జాయింట్ కమిషనర్ అశుతోష్ ధుంబ్రే చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం హ‌తుల్లో … హస్నెన్ త‌ల్లిదండ్రులు, భార్యా ఇద్ద‌రు పిల్ల‌లు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి పిల్ల‌లు ఆరుగురు ఉన్నారు. ఇందులో త‌న మూడునెల‌ల పాప‌, చెల్లెలి అయిదునెల‌ల బాబు ఉన్నారు.

1213హస్నెన్ హ‌త్య‌ల‌ను ప‌థ‌కం ప్ర‌కార‌మే చేశాడు. అంత‌కుముందు భివండీ వెళ్లిన భార్య‌ను ఇంటికి ర‌ప్పించాడు. అక్కాచెల్లెళ్ల‌ను గెట్‌టుగెద‌ర్ పార్టీకి రావాల‌ని ఆహ్వానించాడు. రాత్రి తిన్న ఆహారంలో మ‌త్తుమందు క‌లిపి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. హ‌స్నెన్ తెల్ల‌వారు జామున 3గంటల ప్రాంతంలో త‌మ ఇంటికి స‌మీపంలోని మ‌సీదు వ‌ద్ద ప్రార్థ‌న‌లు చేసిన‌ట్టుగా చుట్టుప‌క్క‌ల వారు చెబుతున్నారు. అలాగే అత‌ను క‌త్తికి ప‌దును పెట్ట‌డం తాము చూశామ‌ని, ఎందుకు అని అడ‌గ్గా న‌వ్వి ఊరుకున్నాడ‌ని వారు తెలిపారు. ఈ కిరాత‌క ఘ‌ట‌న‌లో హంత‌కుడి ఒక సోద‌రి సుబినా బ‌ర్మ‌ల్ (22) మాత్ర‌మే కొన ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. తెల్ల‌వారు జామున ఆమె కేక‌లు వేయ‌డంతో ఇరుగుపొరుగువారు గ్రిల్స్ క‌ట్‌చేసి ఆమెను బ‌య‌ట‌కు తెచ్చారు. అయితే త‌న క‌ళ్ల‌ముందే త‌న అయిదునెల‌ల కొడుకుని చంప‌డం చూసిందామె. అయితే ఆమె హ‌త్య‌లు ఎలా జ‌రిగాయో చెప్ప‌గ‌లిగింది కానీ, అందుకు గ‌ల కార‌ణాల‌ను ఊహించ‌లేక‌పోతోంది. సుబీనా ప్ర‌స్తుతం మెడ గాయానికి చికిత్స పొందుతోంది.

పోలీసులు, హస్నెన్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకలున్న వ‌స్తువుల‌ను, ఆహార పదార్థాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. హస్నెన్ కుటుంబానికి గతంలో చాలా ఆస్తులుండేవని, అతని తండ్రి దర్గా ట్రస్టీగా పనిచేశారని బంధువులు తెలిపారు. అతడు ఇంత దారుణానికి పాల్పడతాడని ఊహించలేదంటూ హ‌స్నెన్ ప్రాణస్నేహితుడు లియాఖత్ ఆవేద‌న చెందాడు.
హ‌త్య‌ల వెనుక ఆస్తి త‌గాదాలు ఉండ‌వ‌చ్చ‌ని పోలీసు భావిస్తున్నారు. అయితే 2012లో త‌మ కుటుంబంపై విష ప్ర‌యోగం జరిగిన‌ప్ప‌టినుండి హస్నెన్ ఓ ద‌ర్గాకి త‌ర‌చుగా వెళ్లివ‌స్తున్నాడ‌ని, క్షుద్ర శ‌క్తులను న‌మ్మ‌టం వ‌ల్ల‌నే ఇలా చేశాడ‌నేది మ‌రొక అనుమానం.

ఇదిలా ఉండ‌గా ఈ ఘోరానికి కొన‌సాగింపుగా మరొక విషాదం చోటుచేసుకుంది. థానే ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను చిత్రీకరిస్తున్న ఒక చానల్ కెమెరామెన్ రతన్ బౌమిక్ (31) ఆ దృశ్యాల‌ను చూసి త‌ట్టుకోలేక గుండెపోటుకి గుర‌య్యాడు. అత‌ను చికిత్సపొందుతూ మృతిచెందాడు.

First Published:  28 Feb 2016 11:52 PM GMT
Next Story