డేవిడ్ రాజు అందుకే కాళ్ల మీద పడ్డారా?

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరిపోయారు. బాబు కండువా కప్పే సమయంలో ఏకంగా ఆయన కాళ్ల మీద పడి దండం పెట్టేశారు డేవిడ్ రాజ్.  అయితే డేవిడ్ రాజ్ చేరిక సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ప్రలోభాల ప్యాకేజ్‌పై కథనం ప్రచురించింది. ఇప్పటివరకు మంత్రులు, ముఖ్యనేతలు ఫిరాయింపులు రాజకీయాలను పర్యవేక్షించగా  ఇప్పుడు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారని కథనం.

ఇప్పటి వరకు  20 నుంచి 30 కోట్ల వరకు ఎరగా చూపుతూ వచ్చిన అధికార పక్షం అనుకున్నంత స్థాయిలో ఫలితం లేకపోవడంతో ఫ్యాకేజ్ రేట్ పెంచేసిందట. ఇప్పుడు 40 కోట్ల వరకు ఎమ్మెల్యేకు ఖరీదు పలుకుతోందని కథనం.  వీటితో పాటు  కాంట్రాక్టులు అదనం.  డేవిడ్ రాజుకు ఇచ్చిన ప్యాకేజ్‌ తెలుసుకుని టీడీపీ నేతలే షాక్ అవుతున్నారట. రూ. 40 కోట్లు, అంతకంటే ఎక్కవ గిట్టుబాటు కావడం వల్లే డేవిడ్‌ రాజు ఏకంగా సీఎం కాళ్ల మీద పడ్డారని చెబుతున్నారు.

డేవిడ్ రాజ్‌కు భారీగానే ప్యాకేజ్ ముట్టిందని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించినట్టు కూడా సదరు కథనం కోట్  చేసింది. నిజంగానే 40 కోట్లు అందకపోయి ఉన్నా కోట్ల రూపాయాలు అందకుండా ఉంటే మాత్రం పార్టీలు మారేంత నిజాయితీ పరులైతే మన నేతలు కాదు. అలా నిజాయితీ పరే అయి ఉంటే అసలు పార్టీలే మారరు కదా!

Click on image to read:  

jagan-adi-chandrababu

adhinarayana

bireddy

jc-diwakar-reddy

polavaram

tdp-leaders-tenali

kcr-grand-children

babu-house-in-vijayawada

bhuma-akhila-priya

bhuma

jagan-akhilpriya

adhinarayana-reddy

roja-gali

jagan-jc-rahul

roja-anam

pawan

revanth

ysrcp