Telugu Global
Cinema & Entertainment

తుంటరోడు వెనక్కి తగ్గాడు

ఒకేసారి వరుసగా సినిమాల్ని పట్టాలపైకి తీసుకొచ్చిన నారా రోహిత్… తన సినిమా పరంపరలో భాగంగా ముందుగా తుంటరిని మార్కెట్లోకి దించాలనుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. మార్చి 4న తుంటరి కూడా విడుదల అవుతుందని  గతంలోనే  ప్రకటించాడు. అయితే తాజాగా నారా రోహిత్ చెప్పిన తేదీకి చాలా సినిమాలు బరిలో నిలిచాయి. వాటిలో కొన్ని సినిమాలపై అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి టైమ్ లో వచ్చి రిస్క్ చేయడం ఇష్టంలేని నారా రోహిత్… […]

తుంటరోడు వెనక్కి తగ్గాడు
X
ఒకేసారి వరుసగా సినిమాల్ని పట్టాలపైకి తీసుకొచ్చిన నారా రోహిత్… తన సినిమా పరంపరలో భాగంగా ముందుగా తుంటరిని మార్కెట్లోకి దించాలనుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. మార్చి 4న తుంటరి కూడా విడుదల అవుతుందని గతంలోనే ప్రకటించాడు. అయితే తాజాగా నారా రోహిత్ చెప్పిన తేదీకి చాలా సినిమాలు బరిలో నిలిచాయి. వాటిలో కొన్ని సినిమాలపై అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి టైమ్ లో వచ్చి రిస్క్ చేయడం ఇష్టంలేని నారా రోహిత్… తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. తుంటరిని 4న కాకుండా…. మార్చి 11న విడుదల చేయాలనుకుంటున్నాడు.
తమిళ్ లో హిట్టయిన మాన్ కరాటే అనే సినిమాకు రీమేక్ గా తుంటరి తెరకెక్కించిది. ఎన్నారై బ్యూటీ లతా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అలీ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో కాస్తోకూస్తో క్రేజ్ తెచ్చుకోవాలని భావిస్తున్నాడు నారా రోహిత్. ఒకవేళ ఈ సినిమా హిట్టయితే ఆ వెంటనే తన మిగతా సినిమాల్ని వరుసగా లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు.
Click on Image to Read:
koratala
pawan
mahesh-babu
aada-sharma
priyanka
First Published:  28 Feb 2016 8:31 PM GMT
Next Story