Telugu Global
National

ఆ సూక్తి… మ‌హాత్మా గాంధీ చెప్పింది కాద‌ట‌!

రాజ‌కీయాలు అలాగే ఉంటాయి. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు ఏం మాట్లాడినా అందులో రంధ్రాన్వేష‌ణ చేయ‌డానికి చాలామంది సిద్ధంగా ఉంటారు.  అమెరికాలో అధ్య‌క్ష ప‌ద‌వి పోరులో   రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున  పోటీప‌డుతున్న డొనాల్డ్ ట్రంప్‌కి అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. మ‌హాత్మాగాంధీ అన్న‌ట్టుగా చెబుతున్న ఒక కొటేష‌న్‌ని ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానికింద మ‌హాత్మా గాంధీ అని పేర్కొన్నారు.  అయితే దానిపై అమెరికా మీడియా పెద్ద దుమారాన్ని రేపింది. మొద‌ట‌ వాళ్లు నిన్ను నిర్ల‌క్ష్యం చేస్తారు, త‌రువాత […]

రాజ‌కీయాలు అలాగే ఉంటాయి. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు ఏం మాట్లాడినా అందులో రంధ్రాన్వేష‌ణ చేయ‌డానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అమెరికాలో అధ్య‌క్ష ప‌ద‌వి పోరులో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీప‌డుతున్న డొనాల్డ్ ట్రంప్‌కి అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. మ‌హాత్మాగాంధీ అన్న‌ట్టుగా చెబుతున్న ఒక కొటేష‌న్‌ని ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానికింద మ‌హాత్మా గాంధీ అని పేర్కొన్నారు. అయితే దానిపై అమెరికా మీడియా పెద్ద దుమారాన్ని రేపింది.

మొద‌ట‌ వాళ్లు నిన్ను నిర్ల‌క్ష్యం చేస్తారు, త‌రువాత నిన్ను చూసి ఎగ‌తాళిగా న‌వ్వుతారు, త‌రువాత నీతో పోరాటం చేస్తారు, అప్పుడు గెలుపు నీద‌వుతుంది… ఇదీ ఆ కొటేష‌న్‌. అల‌బామాలో త‌న మ‌ద్ధ‌తుదారుల‌తో ఉన్న ఫొటోతో పాటు దీన్ని పోస్ట్ చేశారాయ‌న‌. అయితే అమెరికా టాప్ పొలిటిక‌ల్ వెబ్‌సైట్, ది హిల్ దీనిపై స్పందిస్తూ ఈ మాట‌లు గాంధీ అన్న‌ట్టుగా రుజువులు రికార్డులు ఎక్క‌డా లేవ‌న్న‌ది.

1918లో ట్రేడ్ యూనియ‌న్ మీటింగ్‌లో సోష‌లిస్ట్ నాయ‌కుడు నికోల‌స్ క్లెయిన్‌ ఇదే త‌ర‌హా మాట‌ల‌ను వాడినట్టుగా ఆ వెబ్‌సైట్ పేర్కొంది. క్రిస్టియ‌న్ సైన్స్ మానిట‌ర్ అనే అంత‌ర్జాతీయ వార్తా సంస్థ‌…ఒక‌రిచేత అన‌బ‌డి, మ‌రొక‌రు అన్న‌ట్టుగా ప్ర‌చారంలో ఉన్న ప‌ది ప్ర‌ముఖ రాజ‌కీయ కొటేష‌న్ల‌లో దీన్ని ఒక‌టిగా గుర్తించిన‌ట్టుగా హిల్ తెలిపింది. ట్రంప్ బృందం నుండి వెంట‌నే ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఇటాలియ‌న్ ఫాసిస్టు నాయ‌కుడు బెనిటో ముస్సోలిని కొటేష‌న్‌ని ట్వీట్ చేసి…..ఆయ‌న ఇక ఆ త‌రువాత హిట్ల‌ర్ కొటేష‌న్ల‌ను తెచ్చుకుంటార‌నే వెట‌కారాన్ని ఎదుర్కొన్న ట్రంప్, త‌రువాత గాంధీ కొటేష‌న్‌ని ఎంపిక చేసుకున్నారు. అయినా అదీ, స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌కుండా ఇలా ఎదురుతిరిగింది. చాలా పాపుల‌ర్ వెబ్‌సైట్లు ఈ కొటేష‌న్‌ని గాంధీ చెప్పిన‌ట్టుగానే రాస్తున్నా, అది నిజం కాద‌ని వికీకోట్స్ పేర్కొంది.

First Published:  29 Feb 2016 9:00 PM GMT
Next Story