మొన్న పవన్ కళ్యాణ్… ఇప్పుడు కళ్యాణ్ రామ్

ఈ ఇద్దరు కల్యాణ్ లు ఇప్పుడు జర్నలిస్టులుగా మారారు. గతంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్టుగా ఓ సినిమా వచ్చింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో వీరావేశ జర్నలిస్టుగా పవన్ కనిపించాడు. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా జర్నలిస్టు గా కనిపించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ రెండు సినిమాలకూ పూరీ జగన్నాదే దర్శకుడు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ ను పాత్రికేయుడిగా చూపించిన జగనే…. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ను కూడా అదే  పాత్రలో చూపించబోతున్నాడు. అంతేకాదు… సినిమా కూడా కెమెరామెన్ గంగంతో రాంబాబుకు కొనసాగింపుగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి బ్యాంకాక్ వెళ్లి… స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేసి వచ్చాడు పూరీ జగన్నాధ్. తన డైలాగ్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసే పూరీ… కళ్యాణ్ రామ్ సినిమా కోసం కూడా అద్భుతమైన డైలాగ్స్ రాశాడట. జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్ ఫ్లాపు అయినప్పటికీ…. కళ్యాణ్ రామ్ హిట్టవ్వాలని కోరుకుందాం…
Click on Image to Read:
allu-arjun
prabhudeva-ntr
pawan1-chiru