ముర‌గ‌దాస్ తో అలా ఫిక్స్ అయిన మ‌హేష్ !

శ్రీ‌మంతుడు విజ‌యం మ‌హేష్ బాబు ఆలోచ‌నను బాగా ప్ర‌భావితం చేసింది అని అన‌డంలో ఎటువంటి సందేహాం లేదు. ఈసినిమాకు ఒక స‌హ నిర్మాత గా వ్య‌వ‌హారించి లాభాలు బాగా గ‌డించ‌డంతో ప్రస్తుత్తం త‌ను న‌టిస్తున్న చిత్రాల‌కు సంబంధించి బాగా కేర్ తీసుకుంటున్నాడు. అలాగే తన రెమ్యునరేషన్ కింద వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవ‌డం ప్రారంభించాడు. సినిమా ప్రారంభంలోనే ఈవిధ‌మైన ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడ‌నేది ఫిలింనగర్ లో ఒక టాక్. క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం శ్రీ‌కాంత్ అడ్డాల‌తో చేస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రం రిలీజ్ అవ్వ‌క ముందే.. మ‌హేష్ త‌న మార్కెట్ ను విస్త‌రించే విధంగా ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు.

కేవ‌లం తెలుగుకు మాత్ర‌మే ప‌రిమితం అయితే.. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ప‌రిథి త‌గ్గిపోతుందని కోలీవుడ్ ను కూడా మ‌హేష్ బాబు బాగా టార్గెట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ తో ఒక బైలింగ్విల్ చిత్రం చేయ‌డానికి మ‌హేష్ ఫిక్స్ అయ్యాడు. బ్ర‌హ్మోత్స‌వం త‌రువాత మ‌హేష్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదేన‌ని ఆయ‌న స‌న్నిహితులు స‌మాచారం.