ఆస్కార్ లో 53 కోట్ల ప్రియాంక‌

అస‌లే అస్కార్ అవార్డు వేడుక‌. మ‌న దేశం నుంచి మొద‌టి సారి ఒక హీరోయిన్ కు ఆహ్వానం. క్వాంటికో అనే టెలివిజిన్ సీరిస్తో హాలీవుడ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా కు .. అస్కార్ ఆహ్వానం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఎంతో ఘ‌నంగా జ‌రిగిన ఈ వేడుక‌లో ప్రియాంక చోప్రా ధ‌రించిన గౌను ఇప్పుడు బి టౌన్ లో టాక్ ఆఫ్ ది టాపిక్ అయ్యింది. ‘మ్యాడ్ మాక్స్ ద ఫ్యూరీ రోడ్’ చిత్రానికిగాను ఉత్తమ ఎడిటర్‌గా అవార్డు గెల్చుకున్న ‘మార్గరెట్ సిక్సెల్’కు ప్రియాంకా చోప్రా అవార్డు ప్రదానం చేశారు. తెలుపు రంగు గౌను, వజ్రాలు పొదిగిన చెవి దుద్దులు, బిగించి కట్టిన జుత్తు, తక్కువ మేకప్‌తో ప్రియాంక చాలా క్యూట్‌గా కనిపించారు. రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసినప్పుడూ, వేదిక మీదకు వెళుతున్న సమయంలోనూ ఆమెలో తడబాటు కనిపించలేదు. ఎంతో కాన్ఫిడెన్స్ తోనే ప్రియాంక‌ అవార్డును ప్ర‌ధానం చేశారు.

ఇక ప్రియాంక ధ‌రించిన ఆభారణాల గురించి చెప్పుకుంటే.. ఆమె ధ‌రించిన మూడు ఉంగరాల్లో ఒకదాని ఖరీదు 23 కోట్లు, మరోటి 6 కోట్లు, ఇంకోటి 2 కోట్లు. చెవిదుద్దుల ఖరీదు 22 కోట్ల రూపాయలట. మొత్తం 53 కోట్ల విలువైన డైమండ్ జ్యువెలరీలో ప్రియాంక ధగాధగా మెరిసిపోయారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ జుహ‌ర్ మురైద్ ప్రియాంక చోప్రా ధరించిన గౌను ను డిజైన్ చేశారు.పైకి గంభీరంగా క‌నిపించిన‌ప్ప‌టికి అవార్డు ప్ర‌ధానం చేస్తున్న స‌మ‌యంలో కొంత నెర్వెస్ ఫీల్ అయ్యార‌ట ప్రియాంక‌. త‌ను లోప‌ల ఎల ఫీల్ అయిన‌ప్ప‌టికి.. బ‌య‌ట‌కు మాత్రం కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యింది కాబ‌ట్టి.. ప్రియాంక సూప‌ర్ మ‌రి.!

Click on Image to Read:
pawan1-chiru
allu-arjun
kalyan-ram-pawan
prabhudeva-ntr