మెగా సలహాను పవన్ వింటాడా…

రెండు రోజులుగా ఓ పెద్ద వార్త టాలీవుడ్ ను కుదిపేస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెబుతారనేదే ఆ వార్త. మరో రెండేళ్లలో సినిమాలు ఆపేసి, పూర్తిస్థాయిలో రాజకీయాలపై పవన్ దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రెండేళ్లలో మ్యాగ్జిమమ్ మరో 3 సినిమాలు చేసి, ఓ వంద కోట్లు పోగేసి అప్పుడు రాజకీయ రణరంగంలోకి దూకాలని పవన్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, దీనికి కొనసాగింపుగా మాత్రం మరో వార్త పుట్టుకొచ్చింది. పవన్ తీసుకున్న నిర్ణయాన్ని చిరంజీవి వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. అప్పుడే సినిమాలకు దూరం కావొద్దని పవన్ కు చిరంజీవి సలహా ఇచ్చారట. ఓ మంచి టైమ్ చూసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని, అప్పటివరకు సినిమాలు చేయాలని పవన్ కు చిరు సూచించారట. అవసరమైతే రాజకీయంగా పవన్ కు అండగా నిలిచేందుకు కూడా చిరు సిద్ధమయ్యారట. తాజాగా వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతనేది పక్కనపెడితే… అసలు ఇలాంటి విషయాల్లో అన్నయ్య సలహాల్ని పవన్ పాటిస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Click on Image to Read:
allu-arjun
kalyan-ram-pawan
prabhudeva-ntr