Telugu Global
Health & Life Style

విడాకుల‌కో సెల్ఫీ...బ్రేక‌ప్‌కో కేకు!

జీవితాన్ని లైట్‌గా తీసుకుంటే మంచిదే కానీ, మ‌రీ ఇంత లైట్‌గానా అనిపించేలా ఉంది ఈ స‌రికొత్త స‌మాచారం. రిలేష‌న్ మొద‌ల‌యిన‌ప్పుడే కాదు, విడిపోయిన‌ప్పుడు, అంటే బ్రేక‌ప్‌  త‌రువాత‌  కూడా కేక్ క‌ట్ చేయాల్సిందే అంటున్నారు కొంత‌మంది న‌వ‌జీవ‌న ఔత్సాహికులు. అవును, వ్య‌క్తులు క‌లిసినా జీవితం కొత్త‌గా ఉంటుంది…విడిపోయినా కొత్త‌గానే ఉంటుంది క‌దా మ‌రి. అదో ర‌కం  స్వేచ్ఛ‌. పాత బాధ‌లు, బంధాలు, కోపాలు, తాపాలు, తిట్లు, త‌న్నులు లాంటివి పోతాయి. అలా చూస్తే  బ్రేక‌ప్‌ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం […]

విడాకుల‌కో సెల్ఫీ...బ్రేక‌ప్‌కో కేకు!
X

జీవితాన్ని లైట్‌గా తీసుకుంటే మంచిదే కానీ, మ‌రీ ఇంత లైట్‌గానా అనిపించేలా ఉంది ఈ స‌రికొత్త స‌మాచారం. రిలేష‌న్ మొద‌ల‌యిన‌ప్పుడే కాదు, విడిపోయిన‌ప్పుడు, అంటే బ్రేక‌ప్‌ త‌రువాత‌ కూడా కేక్ క‌ట్ చేయాల్సిందే అంటున్నారు కొంత‌మంది న‌వ‌జీవ‌న ఔత్సాహికులు. అవును, వ్య‌క్తులు క‌లిసినా జీవితం కొత్త‌గా ఉంటుంది…విడిపోయినా కొత్త‌గానే ఉంటుంది క‌దా మ‌రి. అదో ర‌కం స్వేచ్ఛ‌. పాత బాధ‌లు, బంధాలు, కోపాలు, తాపాలు, తిట్లు, త‌న్నులు లాంటివి పోతాయి. అలా చూస్తే బ్రేక‌ప్‌ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం కూడా ఒక‌ర‌కంగా క‌రెక్టే. అలాగే విడాకులు తీసుకున్న‌పుడు సెల‌బ్రేట్ చేసుకోవ‌డ‌మూ అవ‌స‌ర‌మే అంటున్నారు మ‌రికొంద‌రు. విడాకులు కూడా చాలామందికి పున‌ర్జ‌న్మ‌నిస్తుంటాయి కాబ‌ట్టి వీరి ఆలోచ‌న‌కూడా ఆలోచించాల్సిన విష‌య‌మే.

గ‌త ఏడాదిగా సోష‌ల్ మీడియాలో ఈ కొత్త సంస్కృతి ఎక్కువ‌గా క‌న‌బడుతోంది. విడాకులు తీసుకున్న జంట‌లు ఆ ఆనందాన్ని ప‌ట్ట‌లేక కోర్టు బ‌య‌టే సెల్ఫీలు తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గ‌త సంవ‌త్స‌ర కాలంగా ఇలాంటి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో కొల్ల‌లుగా క‌న‌బ‌డుతున్నాయి. అలాగే ప‌లుర‌కాల బ్రేక‌ప్ కేకులు సైతం అత్యంత సృజ‌నాత్మ‌క కాన్సెప్టుల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. బ్రేక‌ప్ అయిన‌వాళ్లు కేకులు క‌ట్‌చేస్తామంటే కొత్త ఆలోచ‌న‌ల‌తో కేకులు త‌యారుచేసేవారికి కొద‌వేముంటుంది. మొత్తానికి ఈ ఆధునిక‌శైలిలో, జీవితంలో ఏది జ‌రిగినా స్థిత ప్ర‌జ్ఞ‌త‌తో ముందుకుపోవాల‌నే తాత్విక చింత‌న కూడా ఉంది మ‌రి.

First Published:  3 March 2016 5:18 AM GMT
Next Story