Telugu Global
NEWS

రాత్రి 11 గంటలకు పయ్యావుల సాక్షితో కాళ్లబేరానికి దిగారా!

అమరావతిలో భూకుంభకోణం వెలుగు  చూపిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. సాక్షి కథనంపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్… జగన్‌కు దమ్ముంటే, మాగాడైతే ఇరువురి ఆస్తులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.  పయ్యావుల కేశవ్ మగాడైతే, సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే  చర్చకు రావాలని సవాల్ విసిరారు.  పయ్యావుల కేశవ్ స్ధాయికి జగన్ అవసరంలేదని వైసీపీ కార్యకర్త […]

రాత్రి 11 గంటలకు పయ్యావుల సాక్షితో కాళ్లబేరానికి దిగారా!
X

అమరావతిలో భూకుంభకోణం వెలుగు చూపిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. సాక్షి కథనంపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్… జగన్‌కు దమ్ముంటే, మాగాడైతే ఇరువురి ఆస్తులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ మగాడైతే, సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. పయ్యావుల కేశవ్ స్ధాయికి జగన్ అవసరంలేదని వైసీపీ కార్యకర్త చాలని అంబటిరాంబాబు అన్నారు. పయ్యావుల అంగీకరిస్తే ఉరవకొండలో చర్చకు వైసీపీ కార్యకర్తను పంపుతామన్నారు.

తాను మగాడిలా రాజదానిలో బినామీల అవసరం లేకుండా భూమి కొన్నానని పయ్యావుల చెప్పడంపైనా అంబటి తీవ్రంగా స్పందించారు. పయ్యావుల మగాడిలా భూములు కొని ఉంటే మరీ బినామీల పేరుతో భూములు కొన్న నారాయణ, ప్రత్తిపాటి, సుజనా, మురళీ, రావెల వీరంతా మగాళ్లు కాదా అని ప్రశ్నించారు. అసలు రాజధాని అక్కడే వస్తుందన్న విషయం పయ్యావులకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

తాను మగాడిలా భూమి కొన్నానని చెబుతున్న పయ్యావుల కేశవ్ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సాక్షి సిబ్బందితో కాళ్లబేరం నడిపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాక్షి కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది నుంచి కంట్రిట్యూటర్ వరకు బతిమలాడి తనపై కథనం రాకుండా చేసేందుకు ప్రయత్నించలేదా అని పయ్యావులను ప్రశ్నించారు. రాత్రి కాళ్ల బేరానికి వచ్చి పగలు మాత్రం జగన్‌పై సవాళ్లు విసరడం విచిత్రంగా ఉందన్నారు.

జగన్‌ గురించి మరిన్ని నిజాలు సీబీఐకి తెలియజేస్తా అని పయ్యావుల చెప్పడంపై స్పందిస్తూ… జగన్‌ అక్రమాలపై సాక్ష్యాలు ఉంటే ఇంతకాలం ఎందుకు సీబీఐకి సమర్పించలేదని ప్రశ్నించారు. ఇంతకాలం గాడిదలు కాశారా అని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎన్నికలకు ముందు అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు… లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన బంగ్లాలో నిద్రపోవడానికి సిగ్గుగా లేదా అని అంబటి ప్రశ్నించారు.

Click on image to read:

bonda

sujana

murali-mohan

mudragada-phone-tapping

mudragada

chandrababu-suryudu

chandrababu-1

chandrababu

narayana-pattipati

roja

Minister-MLC-Narayana

jagan1

lokesh
chandrababu

ramoji-undavalli

MLC-Narayana

dulipala

ganta-chandrababu

mininster-Narayana

ap-capital

tdp-ysrcp

First Published:  3 March 2016 5:21 AM GMT
Next Story