Telugu Global
Cinema & Entertainment

కృష్ణగాడి లవర్ కు బంపర్ ఆఫర్

నాని హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ కృష్ణగాడి వీరప్రేమగాధ. ఈ సినిమా నాని కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో… అందులో హీరోయిన్ గా నటించిన మెహరీన్ కు కూడా అంతే కలిసొచ్చింది. తొలి సినిమాతోనే తన లుక్స్, యాక్టింగ్ తో అందర్నీ ఫ్లాట్ చేసింది మెహరీన్. ఈ అందాలు ఆడియన్స్ నే కాదు… ఎగ్రెసివ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను కూడా ఫ్లాట్ చేశాయి. అందుకే వెంటనే తన సినిమాలో మెహరీన్ కు హీరోయిన్ ఛాన్స్ […]

కృష్ణగాడి లవర్ కు బంపర్ ఆఫర్
X
నాని హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ కృష్ణగాడి వీరప్రేమగాధ. ఈ సినిమా నాని కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో… అందులో హీరోయిన్ గా నటించిన మెహరీన్ కు కూడా అంతే కలిసొచ్చింది. తొలి సినిమాతోనే తన లుక్స్, యాక్టింగ్ తో అందర్నీ ఫ్లాట్ చేసింది మెహరీన్. ఈ అందాలు ఆడియన్స్ నే కాదు… ఎగ్రెసివ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను కూడా ఫ్లాట్ చేశాయి. అందుకే వెంటనే తన సినిమాలో మెహరీన్ కు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కావడం విశేషం. టెంపర్ హిట్ తర్వాత పూరితో కలిసి మరో సినిమా ప్లాన్ చేశాడు తారక్. ఇప్పటికే పూరి చెప్పిన స్టోరీలైన్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కొరటాలతో చేస్తున్న సినిమా కంప్లీట్ అయినవెంటనే… పూరి మూవీ ఉంటుంది. ఈ సినిమాలోనే మెహరీన్ ను హీరోయిన్ గా ఎంపికచేశారు. ఈ గ్యాప్ లో ఈ భామ ఇంకెన్ని అవకాశాలు కొల్లగొడుతుందో చూడాలి.
First Published:  2 March 2016 11:23 PM GMT
Next Story