Telugu Global
CRIME

అమ్మానాన్న... మ‌ళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు!

పెళ్ల‌యిన త‌న‌కు త‌ల్లిదండ్రులు తిరిగి పెళ్లి చేయాల‌ని చూస్తున్నార‌ని, త‌న‌ను కాపాడాల్సిందిగా కోరుతూ  21ఏళ్ల హ‌జారా బేగం రాష్ట్ర మైనారిటీస్ క‌మిష‌న్‌ని ఆశ్ర‌యించింది. త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు, ఒక స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్, మ్యారేజి బ్రోక‌ర్ క‌ల‌సి త‌న‌ను ఒక అర‌బ్‌కి ఇచ్చి వివాహం చేయాల‌ని చూస్తున్నార‌ని హైద‌రాబాద్‌, కాలాప‌త్త‌ర్‌లో నివాస‌ముంటున్న హ‌జారా త‌న ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుకి స్పందించిన క‌మిష‌న్ ఈ విష‌యంలో ఎస్ఐ పాత్ర గురించి విచార‌ణ జ‌రిపించాల్సిందిగా కోరుతూ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ ఆప్ […]

పెళ్ల‌యిన త‌న‌కు త‌ల్లిదండ్రులు తిరిగి పెళ్లి చేయాల‌ని చూస్తున్నార‌ని, త‌న‌ను కాపాడాల్సిందిగా కోరుతూ 21ఏళ్ల హ‌జారా బేగం రాష్ట్ర మైనారిటీస్ క‌మిష‌న్‌ని ఆశ్ర‌యించింది. త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు, ఒక స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్, మ్యారేజి బ్రోక‌ర్ క‌ల‌సి త‌న‌ను ఒక అర‌బ్‌కి ఇచ్చి వివాహం చేయాల‌ని చూస్తున్నార‌ని హైద‌రాబాద్‌, కాలాప‌త్త‌ర్‌లో నివాస‌ముంటున్న హ‌జారా త‌న ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుకి స్పందించిన క‌మిష‌న్ ఈ విష‌యంలో ఎస్ఐ పాత్ర గురించి విచార‌ణ జ‌రిపించాల్సిందిగా కోరుతూ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ ఆప్ పోలీస్ (ద‌క్షిణ‌)కి షోకాజ్ నోటీసు పంపింది. త‌న త‌ల్లిదండ్రులు, సోద‌రుడు క‌లిసి త‌న‌ను ఒక అర‌బ్‌కిచ్చి వివాహం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అందుకే త‌న భ‌ర్త‌నుండి విడాకులు తీసుకోవాల్సిందిగా త‌న‌ను ఒత్తిడి పెడుతున్నార‌ని, ఈ విష‌యంలో మ్యారేజి బ్రోకర్‌, ఎస్ ఐ కూడా త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఇద్ద‌రి వ‌ల‌న త‌మ‌కు ప్రాణ‌హాని ఉందంటూ భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన డిసిపి స‌త్య‌న్నారాయ‌ణ ఈ కేసు గురించిన వివ‌ర‌ణ ఇచ్చారు. నిజానికి హ‌జారా త‌ల్లిదండ్రులు, ఆమె క‌న‌బ‌డ‌టం లేద‌ని పోలీస్ కంప్ల‌యింట్ ఇవ్వ‌గా స‌ద‌రు ఎస్ఐ కేసు న‌మోదు చేసుకున్నాడ‌ని, ఆ కేసుని క్లోజ్ చేయ‌డం కోస‌మే వారిని స్టేష‌న్‌కి రావాల్సిందిగా కోరుతూ హ‌జారాకు, ఆమె భ‌ర్త‌కు అత‌ను ఫోన్లు చేశాడ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. ఇంకా ఆమె త‌ల్లిదండ్రులే తమ కుమార్తెని అరెస్టు చేయాల్సిందిగా ఎస్ఐపై ఒత్తిడి తెచ్చార‌ని కూడా ఆయ‌న తెలిపారు. అర‌బ్‌తో వివాహం గురించి ఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌న్నారు. స్టేట్‌ మైనార్టీస్ క‌మిష‌న్ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కి చార్మినార్ డివిజ‌న్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్‌ పోలీస్ స‌మాధానం ఇస్తార‌ని ఆయ‌న తెలిపారు.

First Published:  4 March 2016 3:45 AM GMT
Next Story