Telugu Global
National

ఈ తాత‌గారు...గ‌జ‌నీ మ‌హ‌మ్మ‌ద్‌కే తాత‌గారు!

ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌దేప‌దే హాజ‌ర‌య్యేవారిని ఇదివ‌ర‌కు గ‌జ‌నీమ‌హ‌మ్మ‌ద్ దండ‌యాత్ర‌ల‌తో పోల్చేవారు. కానీ ఈ తాత‌గారు ప‌ట్టుద‌ల‌లో గ‌జ‌నీ మ‌హ‌మ్మ‌ద్‌కే తాతలాంటివారు.   రాజ‌స్థాన్‌కి చెందిన శివ‌చ‌ర‌ణ్ యాద‌వ్ ప‌ట్టుద‌ల‌ను మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆయ‌న ద‌శాబ్దాలుగా టెన్త్ ప‌రీక్ష‌లు రాస్తున్నాడు.  పాస‌య్యేవ‌ర‌కు త‌న ఉడుంప‌ట్టు వ‌ద‌ల‌నంటున్నాడు. ఖొహారీ గ్రామానికి చెందిన యాద‌వ్ వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు. 1968లో ఆయ‌న మొద‌టిసారి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశాడు. ప్ర‌స్తుతం 47వ‌సారి, ఈ నెల ప‌దిన మొద‌లుకానున్న ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నాడు. అప్ప‌టి నుండి […]

ఈ తాత‌గారు...గ‌జ‌నీ మ‌హ‌మ్మ‌ద్‌కే తాత‌గారు!
X


ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌దేప‌దే హాజ‌ర‌య్యేవారిని ఇదివ‌ర‌కు గ‌జ‌నీమ‌హ‌మ్మ‌ద్ దండ‌యాత్ర‌ల‌తో పోల్చేవారు. కానీ ఈ తాత‌గారు ప‌ట్టుద‌ల‌లో గ‌జ‌నీ మ‌హ‌మ్మ‌ద్‌కే తాతలాంటివారు. రాజ‌స్థాన్‌కి చెందిన శివ‌చ‌ర‌ణ్ యాద‌వ్ ప‌ట్టుద‌ల‌ను మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆయ‌న ద‌శాబ్దాలుగా టెన్త్ ప‌రీక్ష‌లు రాస్తున్నాడు. పాస‌య్యేవ‌ర‌కు త‌న ఉడుంప‌ట్టు వ‌ద‌ల‌నంటున్నాడు. ఖొహారీ గ్రామానికి చెందిన యాద‌వ్ వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు. 1968లో ఆయ‌న మొద‌టిసారి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశాడు. ప్ర‌స్తుతం 47వ‌సారి, ఈ నెల ప‌దిన మొద‌లుకానున్న ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నాడు.

77-year-old-set-for-47th-shot-at-class-x-examఅప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు రాస్తూనే ఉన్నాడు. అంతేనా ప‌ది పాస‌య్యేవ‌ర‌కు పెళ్లి చేసుకోన‌ని శ‌ప‌థం కూడా చేశాడు. దాంతో పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. ప‌రీక్ష రాసిన‌ప్పుడ‌ల్లా కొన్ని స‌బ్జ‌క్టులు పాస‌యితే కొన్ని ఫెయిలైపోతున్నాన‌ని యాద‌వ్ అంటున్నాడు. ఈ సారైనా అన్ని స‌బ్జ‌క్టులు పాస‌వుతాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడాయ‌న‌. 1995లో గ‌ట్టెక్కేశాన‌నుకున్నాడు, కానీ ఆ సంవ‌త్సరం లెక్క‌లు ప‌రీక్ష పోయింది. గ‌త సంవ‌త్స‌రం సాంఘిక శాస్త్రం ఒక్క‌టే పాస్ కాగ‌లిగాడు. అంత‌కుముందు సంవ‌త్స‌రం అన్ని స‌బ్జ‌క్టులు పోయాయి. ఈ సారి కొంత‌మంది స్కూలు టీచ‌ర్ల నుండి పాఠాలు చెప్పించుకున్నాన‌ని ఎలాగైనా పాస‌యి పోతాన‌ని అంటున్నాడు.

Shiv_Charan_Yadav_30 సంవ‌త్స‌రాలుగా త‌మ పూర్వీకుల ఇంట్లో ఉంటున్న యాద‌వ్‌కి ఎవ‌రూ లేరు. త‌ల్లి, అత‌ను రెండునెల‌ల బిడ్డగా ఉన్న‌ప్పుడే మ‌ర‌ణించింది. తండ్రి త‌న ప‌దేళ్ల వ‌య‌సులో చ‌నిపోయాడు. బంధువులు పెంచి పెద్ద‌చేశారు. ప్ర‌భుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్ష‌న్‌, గుళ్ల‌లో పెట్టే ప్ర‌సాదాలు ఇవే త‌న‌ని బ‌త‌కిస్తున్నాయంటున్నాడు యాద‌వ్‌. అంతేకాదు, టెన్త్ క్లాస్ పాస్ కావాల‌నే ఆశ‌యం కూడా ఆయ‌న‌కు జీవితంపై ఆశ‌ని పెంచుతోంద‌ని చెప్పాలి. ఈ ప‌రీక్ష‌లు ఎవ‌రికోస‌మో కాదు, య‌వ్వనంలో ఉన్న‌పుడు త‌న‌కు తాను ఇచ్చుకున్న మాట‌ని నెర‌వేర్చుకోవ‌డానికే అంటున్నాడు యాద‌వ్‌. ఈసారైనా ఆయ‌న పాస్ అవుతాడ‌ని ఆశిద్దాం.

First Published:  3 March 2016 1:01 PM GMT
Next Story