Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాలో అనసూయ లేదు

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న రీమేక్ సినిమా కోసం అనసూయను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ దగ్గరుండి మాట్లాడి మరీ…. చెర్రీ సినిమాలో ఐటెంసాంగ్ చేసేలా అనసూయను ఒప్పించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది అనసూయ. క్షణం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హాట్ టీవీ యాంకర్…. ఇప్పటివరకు చెర్రీ సినిమా యూనిట్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా […]

ఆ సినిమాలో అనసూయ లేదు
X
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న రీమేక్ సినిమా కోసం అనసూయను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ దగ్గరుండి మాట్లాడి మరీ…. చెర్రీ సినిమాలో ఐటెంసాంగ్ చేసేలా అనసూయను ఒప్పించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది అనసూయ. క్షణం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హాట్ టీవీ యాంకర్…. ఇప్పటివరకు చెర్రీ సినిమా యూనిట్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఈ విషయంలో సంప్రదించలేదని చెబుతోంది. అసలు ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో తనకు అర్థం కావడం లేదని అంటోంది. సరే… పుకార్ల సంగతి పక్కనపెడితే… చెర్రీ సినిమాలో ఐటెంసాంగ్ చేయడం ఇష్టమేనా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటేస్తోంది అనసూయ. ముందు వాళ్లను సంప్రదించమనండి… తర్వాత ఏం చేయాలో అలోచిద్దాం అనే రకంగా సమాధానం ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం సినిమా విజయాలతో అనసూయ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
First Published:  4 March 2016 5:34 AM GMT
Next Story