Telugu Global
Health & Life Style

గుర‌క‌లో ముందుంటే...క్లాసులో వెనుక‌!

పిల్ల‌లు గుర‌క‌పెడుతుంటే నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దంటున్నారు వైద్య ప‌రిశోధ‌కులు. అప్పుడ‌ప్పుడు కాకుండా త‌ర‌చుగా గుర‌క పెట్టే పిల్ల‌ల్లో ఏకాగ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని, వీరిలో నేర్చుకునే సామ‌ర్ధ్యం కూడా త‌గ్గిపోతుంద‌ని కొన్ని అధ్య‌య‌నాలు రుజువు చేస్తున్నాయి. రోజూ గుర‌క‌పెడుతుంటే పిల్ల‌లు నిద్ర‌లేమికి గుర‌వుతార‌ని, దానివ‌ల‌న వారు ప‌గ‌టిపూట చాలా అల‌స‌ట‌గా ఉంటార‌ని, అందుకే బ‌డిలో పాఠాలు శ్ర‌ద్ధ‌గా విన‌లేర‌ని, చ‌ద‌వ‌లేర‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అంతే కాదు, వీరిలో ప‌క్క‌త‌డ‌ప‌టం, పెరుగుద‌ల‌లోపాలు కూడా ఉంటాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. చాలామంది పిల్ల‌లు టాన్సిల్స్ […]

గుర‌క‌లో ముందుంటే...క్లాసులో వెనుక‌!
X

పిల్ల‌లు గుర‌క‌పెడుతుంటే నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దంటున్నారు వైద్య ప‌రిశోధ‌కులు. అప్పుడ‌ప్పుడు కాకుండా త‌ర‌చుగా గుర‌క పెట్టే పిల్ల‌ల్లో ఏకాగ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని, వీరిలో నేర్చుకునే సామ‌ర్ధ్యం కూడా త‌గ్గిపోతుంద‌ని కొన్ని అధ్య‌య‌నాలు రుజువు చేస్తున్నాయి. రోజూ గుర‌క‌పెడుతుంటే పిల్ల‌లు నిద్ర‌లేమికి గుర‌వుతార‌ని, దానివ‌ల‌న వారు ప‌గ‌టిపూట చాలా అల‌స‌ట‌గా ఉంటార‌ని, అందుకే బ‌డిలో పాఠాలు శ్ర‌ద్ధ‌గా విన‌లేర‌ని, చ‌ద‌వ‌లేర‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అంతే కాదు, వీరిలో ప‌క్క‌త‌డ‌ప‌టం, పెరుగుద‌ల‌లోపాలు కూడా ఉంటాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. చాలామంది పిల్ల‌లు టాన్సిల్స్ పెర‌గ‌టం వ‌ల‌న గుర‌క‌పెడ‌తార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

పిల్ల‌లు గుర‌క‌పెడుతున్నా త‌ల్లిదండ్రులు చాలావ‌ర‌కు ప‌ట్టించుకోక‌పోవ‌డం, దాన్ని సాధార‌ణ విష‌యంగా భావించ‌డం అధ్య‌య‌నంలో గ‌మ‌నించారు. త‌ల్లిదండ్రుల‌కు గుర‌క వ‌ల‌న క‌లిగే న‌ష్టాలు తెలియ‌క‌పోవ‌డం వ‌ల‌న, గుర‌క‌పెడుతున్న పిల్ల‌ల్లో మూడింటా ఒక వంతు మంది మాత్ర‌మే వైద్యుల స‌హాయం పొందుతున్న‌ట్టు కూడా అద్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. పిల్ల‌ల‌ గుర‌క‌ని నిర్ల‌క్ష్యం చేస్తే వారి భ‌విష్య‌త్తుపై ఆ ప్ర‌భావం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

First Published:  5 March 2016 12:32 AM GMT
Next Story