Telugu Global
CRIME

థానే హంత‌కుడికి 67ల‌క్ష‌ల అప్పులున్నాయి!

థానేలో 14 మంది సొంత కుటుంబ స‌భ్యుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన హుస్నెన్ త‌మ ద‌గ్గ‌రి బంధువుల‌నుండి విప‌రీతంగా అప్పులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. పోలీసుల విచార‌ణ‌లో అత‌నికి 67ల‌క్ష‌ల అప్పుంద‌ని తేలింది. వ్యాపారం చేస్తానంటూ అత‌ను ఆ అప్పులు చేశాడు. అలాగే అత‌నికి షేర్ల‌లో డ‌బ్బుపెట్టే అల‌వాటు కూడా ఉంది. హ‌త్య‌ల‌కు కొన్నినెల‌ల ముందు అత‌ను ఒక రూముని అద్దెకు తీసుకున్నాడు. దాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలియ‌లేదు. హుస్నెన్ ఇంట్లో మాన‌సిక అనారోగ్యానికి వాడే మందులు దొరికాయి. వాటిని […]

థానే హంత‌కుడికి 67ల‌క్ష‌ల అప్పులున్నాయి!
X

థానేలో 14 మంది సొంత కుటుంబ స‌భ్యుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన హుస్నెన్ త‌మ ద‌గ్గ‌రి బంధువుల‌నుండి విప‌రీతంగా అప్పులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. పోలీసుల విచార‌ణ‌లో అత‌నికి 67ల‌క్ష‌ల అప్పుంద‌ని తేలింది. వ్యాపారం చేస్తానంటూ అత‌ను ఆ అప్పులు చేశాడు. అలాగే అత‌నికి షేర్ల‌లో డ‌బ్బుపెట్టే అల‌వాటు కూడా ఉంది. హ‌త్య‌ల‌కు కొన్నినెల‌ల ముందు అత‌ను ఒక రూముని అద్దెకు తీసుకున్నాడు. దాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలియ‌లేదు. హుస్నెన్ ఇంట్లో మాన‌సిక అనారోగ్యానికి వాడే మందులు దొరికాయి. వాటిని అత‌ను ఎక్క‌డ కొన్నాడు, ఎవ‌రు వాటిని ప్రిస్క్రైబ్ చేశారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అత‌నిలో స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇందుకోసం వారు మాన‌సిక‌వైద్య నిపుణుల‌ను సంప్ర‌దిస్తున్నారు.

First Published:  5 March 2016 4:50 AM GMT
Next Story