Telugu Global
Cinema & Entertainment

అసలు మహేష్ సినిమా వస్తుందా రాదా...

సమ్మర్ ఎట్రాక్షన్ గా బ్రహ్మోత్సవాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కుదిరితే ఏప్రిల్ మూడో వారంలో బ్రహ్మోత్సవం బరిలోకి దిగుతుందని సూచించారు. కానీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ రోజురోజుకు ఆలస్యం అవుతోందట. దీంతో సినిమా విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి మే నెలకు బ్రహ్మోత్సవాన్ని వాయిదా వేశారు. కుదిరితే మే మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తేదీకి కూడా సినిమా వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. […]

అసలు మహేష్ సినిమా వస్తుందా రాదా...
X
సమ్మర్ ఎట్రాక్షన్ గా బ్రహ్మోత్సవాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కుదిరితే ఏప్రిల్ మూడో వారంలో బ్రహ్మోత్సవం బరిలోకి దిగుతుందని సూచించారు. కానీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ రోజురోజుకు ఆలస్యం అవుతోందట. దీంతో సినిమా విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి మే నెలకు బ్రహ్మోత్సవాన్ని వాయిదా వేశారు. కుదిరితే మే మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తేదీకి కూడా సినిమా వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ పాటికే ఆ షెడ్యూల్ ను పూర్తిచేయాల్సి ఉంది. ఈ పాటికి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. దీంతో మేకర్స్ మరోసారి గందరగోళంలో పడ్డారు. మరోవైపు మహేష్ బాబు స్వయంగా దీనికి సహ-నిర్మాత కూడా కావడంతో…. బడ్జెట్ పై తెగ ఆందోళన చెందుతున్నాడట. ప్రస్తుతం నార్త్-ఇండియాలో జరుగుతున్న షూటింగ్ కంప్లీట్ అయితే తప్ప… బ్రహ్మోత్సవం విడుదల తేదీని కచ్చితంగా చెప్పలేం అంటున్నారు.
First Published:  4 March 2016 11:04 PM GMT
Next Story