Telugu Global
Cinema & Entertainment

బిజినెస్ ప్రారంభించిన బుజ్జిగాడి భామ

తెలుగులో బుజ్జిగాడు సినిమాలో ఫేమ్ లోకి వచ్చింది సంజన. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అయితే కన్నడలో మాత్రం సంజన సూపర్ స్టార్. ఆమెకు అక్కడున్న పాపులారిటీ మరో హీరోయిన్ కు లేదు. అక్కడ ఆమెకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఇదే టైమ్ లో వ్యాపార రంగంలోకి కూడా ఎంటరవ్వాలనుకుంటోంది సంజన. అందుకే ఇప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో బెంగళూరులో… ఓ పవర్ యోగా సెంటర్ […]

బిజినెస్ ప్రారంభించిన బుజ్జిగాడి భామ
X
తెలుగులో బుజ్జిగాడు సినిమాలో ఫేమ్ లోకి వచ్చింది సంజన. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అయితే కన్నడలో మాత్రం సంజన సూపర్ స్టార్. ఆమెకు అక్కడున్న పాపులారిటీ మరో హీరోయిన్ కు లేదు. అక్కడ ఆమెకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఇదే టైమ్ లో వ్యాపార రంగంలోకి కూడా ఎంటరవ్వాలనుకుంటోంది సంజన. అందుకే ఇప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో బెంగళూరులో… ఓ పవర్ యోగా సెంటర్ ను నెలకొల్పింది. ఫైవ్ స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన ఈ పవర్ యోగా సెంటర్ లో…. నిపుణులైన టీచర్స్ తో యోగా నేర్పిస్తారు. ఇందులో సర్టిఫికేట్ కోర్సులు కూడా అందిస్తారు. బెంగళూరులో పవర్ యోగాకు మంచి ఆదరణ ఉంది. పైగా అది ఐటీ హబ్ కావడంతో… సంజన ఈ బిజినెస్ లోకి ఎంటరైంది. తనే సొంతంగా ప్రచారం కూడా ప్రారంభించింది. ఇది క్లిక్కయిన తర్వాత… బెంగళూరులోనే ఓ రెస్టారెంట్ ప్రారంభించే ఆలోచనలో కూడా సంజన ఉంది.
First Published:  5 March 2016 12:08 AM GMT
Next Story