Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ జులాయి టైపు కాదు... సీతమ్మ టైపు....

ప్రస్తుతం నితిన్ తో అ..ఆ అనే సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైమ్… ఓ మల్టీస్టారర్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ స్టోరీలైన్… కొన్ని డైలాగులు అనుకున్నాడు. ఈ మల్టీస్టారర్ లో అల్లుఅర్జున్-నాగార్జున హీరోలుగా నటించబోతున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న అ..ఆ సినిమా… బన్నీ చేస్తున్న సరైనోడు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే ఈ మల్టీస్టారర్ తెరపైకొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ గ్యాప్ లో… ఈ సినిమాపై ఓ […]

త్రివిక్రమ్ జులాయి టైపు కాదు... సీతమ్మ టైపు....
X
ప్రస్తుతం నితిన్ తో అ..ఆ అనే సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైమ్… ఓ మల్టీస్టారర్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ స్టోరీలైన్… కొన్ని డైలాగులు అనుకున్నాడు. ఈ మల్టీస్టారర్ లో అల్లుఅర్జున్-నాగార్జున హీరోలుగా నటించబోతున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న అ..ఆ సినిమా… బన్నీ చేస్తున్న సరైనోడు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే ఈ మల్టీస్టారర్ తెరపైకొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ గ్యాప్ లో… ఈ సినిమాపై ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. బన్నీ-నాగార్జునను పెట్టి… జులాయి, అతడు టైపులో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తాడని కొందరు అంటున్నారు. కానీ త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది తరహాలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఇది ఉండబోతోందని అంటున్నారు. బన్నీ-నాగార్జున మల్టీస్టారర్ కు సంబంధించి మరిన్ని వివరాలు… అ…ఆ సినిమా విడుదల తర్వాత తెలుస్తాయి.
First Published:  4 March 2016 10:15 PM GMT
Next Story