Telugu Global
Cinema & Entertainment

రోబో-2లో ఒకే ఒక్క పాట

దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుడ్ని తీసుకున్నారు. కానీ రోబో-2లో మాత్రం ఒకేఒక్క పాట పెట్టాలని ఫిక్స్ అయ్యారట. తళైవ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన వార్త ఇది. రోబోకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్-2లో కేవలం ఒకే ఒక్క పాట పెట్టాలని దర్శకుడు శంకర్ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే స్క్రీన్ ప్లేను లాక్ చేసిన శంకర్…. […]

రోబో-2లో ఒకే ఒక్క పాట
X
దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుడ్ని తీసుకున్నారు. కానీ రోబో-2లో మాత్రం ఒకేఒక్క పాట పెట్టాలని ఫిక్స్ అయ్యారట. తళైవ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన వార్త ఇది. రోబోకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్-2లో కేవలం ఒకే ఒక్క పాట పెట్టాలని దర్శకుడు శంకర్ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే స్క్రీన్ ప్లేను లాక్ చేసిన శంకర్…. 6 పాటలు పెడితే… సినిమా నిడివి పెరిగిపోవడంతో పాటు కథాగమనంలో ఆటంకాలు వస్తాయని భావిస్తున్నాడట. అందుకే 5 పాటలు తీసేసి ఒకే పాటకు పరిమితమైపోయాడు. ఈ నిర్ణయం వెనక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి బడ్జెట్ నియంత్రణ. 5 పాటల్ని తీసేస్తే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక రెండోది అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్న సినిమాకు పాటలు లేకుండా చేయడమే మంచిదని శంకర్ భావించాడు. శంకర్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రోబో-2 నిడివి గణనీయంగా తగ్గిపోనుంది. దాదాపు 2 గంటలకే సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
First Published:  4 March 2016 11:45 PM GMT
Next Story