Telugu Global
Cinema & Entertainment

సిక్స్ ప్యాక్ కోసం మాస్ రాజా ప్రయత్నం

రవితేజ చొక్కా విప్పగా మీరు ఎప్పుడైనా చూశారా…. అంతెందుకు కనీసం రవితేజ కండలు చూశారా…. ఇప్పటివరకు ప్రేక్షకులకు అలాంటి అదృష్టం దక్కలేదు. రాబోయే సినిమాలో కచ్చితంగా ఈ రెండు ఆఫర్లు తగులుతాయంటున్నారు సినీజనాలు. త్వరలోనే కొత్త దర్శకుడు చక్రి తో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో తన సిక్స్ ప్యాక్ విశ్వరూపం చూపించబోతున్నాడట రవితేజ. దీనికోసం 48 ఏళ్ల వయసులో జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఆల్ […]

సిక్స్ ప్యాక్ కోసం మాస్ రాజా ప్రయత్నం
X
raviteja1రవితేజ చొక్కా విప్పగా మీరు ఎప్పుడైనా చూశారా…. అంతెందుకు కనీసం రవితేజ కండలు చూశారా…. ఇప్పటివరకు ప్రేక్షకులకు అలాంటి అదృష్టం దక్కలేదు. రాబోయే సినిమాలో కచ్చితంగా ఈ రెండు ఆఫర్లు తగులుతాయంటున్నారు సినీజనాలు. త్వరలోనే కొత్త దర్శకుడు చక్రి తో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో తన సిక్స్ ప్యాక్ విశ్వరూపం చూపించబోతున్నాడట రవితేజ. దీనికోసం 48 ఏళ్ల వయసులో జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ వచ్చేసిందని చెబుతున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో కథ ప్రకారం హీరో చొక్కా విప్పాలి. సిక్స్ ప్యాక్ చూపించాలి. అందుకే రవితేజ ఇంత సాహసం చేశాడు. లేటు వయసులో షారూక్ ఎలాగైతే సిక్స్ ప్యాక్ చూపించాడో… తను కూడా బాలీవుడ్ బాద్ షా బాటలో ఆరు ఫలకాల దేహాన్ని చూపించాలని మాస్ రాజా ఫిక్స్ అయినట్టున్నాడు. అన్నట్టు రవితేజ కండలు పెంచిన పిక్స్ కొన్ని నెట్ లో తెగ హంగామా చేస్తున్నాయి.
First Published:  4 March 2016 10:41 PM GMT
Next Story