Telugu Global
CRIME

ఆధార్ కార్డు చెకింగ్‌క‌ని వ‌చ్చి...హ‌త్య‌చేశారు!

నెల్లూరుజిల్లా కావ‌లిలో క‌విత అనే మ‌హిళ‌ను దుండ‌గులు దారుణంగా హ‌త‌మార్చారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు, ఇద్ద‌రు చిన్నారులు  గాయాల‌పాల‌య్యారు. పోలీసులు అందిస్తున్న వివ‌రాల ప్ర‌కారం, శుక్ర‌వారం రాత్రి దుండ‌గులు  ఆధార్ కార్డ్ చెకింగ్ కోసం వ‌చ్చామంటూ ఇంట్లోకి చొర‌బ‌డ్డారు. ఆ ఇల్లు అర‌టితోట‌లో ఉంది. ఇంట్లో క‌విత‌ (35)తో పాటు ఆమె అత్త‌గారు సుశీల‌మ్మ‌, ఆమె మ‌రిది పిల్ల‌లు ఇద్ద‌రు ఉన్నారు.  ఆ ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రి జ‌నార్ధ‌న రెడ్డి హైద‌రాబాద్‌లో టెలికామ్ […]

నెల్లూరుజిల్లా కావ‌లిలో క‌విత అనే మ‌హిళ‌ను దుండ‌గులు దారుణంగా హ‌త‌మార్చారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు, ఇద్ద‌రు చిన్నారులు గాయాల‌పాల‌య్యారు. పోలీసులు అందిస్తున్న వివ‌రాల ప్ర‌కారం, శుక్ర‌వారం రాత్రి దుండ‌గులు ఆధార్ కార్డ్ చెకింగ్ కోసం వ‌చ్చామంటూ ఇంట్లోకి చొర‌బ‌డ్డారు. ఆ ఇల్లు అర‌టితోట‌లో ఉంది. ఇంట్లో క‌విత‌ (35)తో పాటు ఆమె అత్త‌గారు సుశీల‌మ్మ‌, ఆమె మ‌రిది పిల్ల‌లు ఇద్ద‌రు ఉన్నారు. ఆ ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రి జ‌నార్ధ‌న రెడ్డి హైద‌రాబాద్‌లో టెలికామ్ శాఖ‌లో ప‌నిచేస్తున్నాడు. శివ‌రాత్రి పండుగ‌క‌ని అత‌ను త‌న పిల్ల‌ల‌ను త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద వ‌దిలివెళ్లాడు.

దుండ‌గులు ప‌దునైన ఆయుధాల‌తో వ‌చ్చారు. అయితే క‌విత వారిని అడ్డుకునేందుకు చాలా ధైర్యంగా పోరాడింది. వారిక‌ళ్ల‌లో కారం కొట్ట‌డం, ఇనుప‌రాడ్డుతో వారిని కొట్ట‌డం లాంటి చ‌ర్య‌ల‌తో ప్రాణాలు కాపాడుకోవాల‌ని ఆమె ప్ర‌య‌త్నించింది. అయినా దుండ‌గులు ఆమెను వ‌ద‌ల‌లేదు. ఈ దాడిలో సుశీల‌మ్మ‌, మూడు, నాలుగు ఏళ్ల చిన్నారులు ఇద్ద‌రు కూడా గాయాల పాల‌య్యారు. సుశీల‌మ్మ భ‌ర్త నాగిరెడ్డి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి తిరిగి వ‌చ్చేస‌రికి ఇల్లు ర‌క్తంతో భ‌యాన‌కంగా క‌నిపించింది. ఆయ‌నే అంద‌రినీ ఆసుప‌త్రికి త‌ర‌లించినా అప్ప‌టికే క‌విత ప్రాణాలు కోల్పోయింది. సుశీల‌మ్మ‌, పిల్ల‌లకు ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

క‌విత‌ను ఆమె భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి చాలా సంవ‌త్స‌రాలుగా వేధిస్తున్నాడ‌ని, అత‌నే హ‌త్య‌కు బాధ్యుడ‌ని క‌విత‌ త‌ల్లిదండ్రులు ఆరోపించ‌డంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుశీల‌మ్మ అతి క‌ష్టంమీద ఏం జరిగిందో పోలీసుల‌కు చెప్ప‌గ‌లిగింది కానీ ఇంట్లోకి ఎంత‌మంది వ‌చ్చారు అనేవిష‌యం గురించి ఆమె స‌రైన స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయింది.

First Published:  6 March 2016 12:48 AM GMT
Next Story