Telugu Global
Cinema & Entertainment

 నందిని రెడ్డికి  మంచి రోజులు..! 

ఇండ‌స్ట్రీలో  స‌క్సెస్ మాత్ర‌మే  మాట్లాడుతుంది.  లేక పోతే  5 రూపాయ‌ల టి ఆఫ‌ర్ చేయ‌డం కూడా వేస్ట్ అనుకుంటారు కొంద‌రు.   విజ‌యం వ‌రిస్తే  ఇంద్రుడు..చంద్రుడు అంటారు.  ఫెయిల్ అయితే ఐర‌న్ లేగ్ అంటారు.ఈ సిల‌బస్  అంతే.  అలా మొద‌లైంది చిత్రంతో  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన  నందిని రెడ్డి..  ఇండ‌స్ట్రీకి  ఒక   ప్ర‌తిభావంత‌మైన లేడి డైరెక్ట‌ర్ వ‌చ్చింద‌నుకున్నారు. క‌ట్ చేస్తే  జ‌బ‌ర్ధస్థ్ చిత్రంతో    నందిని  ప‌ని అయిపోయింది అన్నారు. అయితే తాజాగా  క‌ళ్యాణ వైభోగ‌మే […]

 నందిని రెడ్డికి  మంచి రోజులు..! 
X
ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుంది. లేక పోతే 5 రూపాయ‌ల టి ఆఫ‌ర్ చేయ‌డం కూడా వేస్ట్ అనుకుంటారు కొంద‌రు. విజ‌యం వ‌రిస్తే ఇంద్రుడు..చంద్రుడు అంటారు. ఫెయిల్ అయితే ఐర‌న్ లేగ్ అంటారు.ఈ సిల‌బస్ అంతే. అలా మొద‌లైంది చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి.. ఇండ‌స్ట్రీకి ఒక ప్ర‌తిభావంత‌మైన లేడి డైరెక్ట‌ర్ వ‌చ్చింద‌నుకున్నారు. క‌ట్ చేస్తే జ‌బ‌ర్ధస్థ్ చిత్రంతో నందిని ప‌ని అయిపోయింది అన్నారు.
అయితే తాజాగా క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో మ‌రోసారి హిట్ ను కొట్టి లైమ్ లైట్ లోకి వ‌చ్చారు. నాగ‌శౌర్య‌,మాళ‌విక నాయ‌ర్ లీడ్ రోల్స్ లో మంచి వినోదాత్మ‌కంగా చేసిన ఈ చిత్రం నిజంగా చిత్ర యూనిట్ అంద‌రికి బూస్టింగ్ ఇచ్చింద‌నే చెప్పాలి. వినోదాన్ని న‌మ్ముకుంటే ఢోకా వుండ‌ద‌నే విష‌యం మ‌రోసారి రుజువు చేసింది. దీంతో ఈ ద‌ర్శ‌కురాలికి ఇప్పుడు ప్రొడ్యూస‌ర్స్ నుంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్లు టాక్. ఒక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నుంచి ప్ర‌స్తుతం మంచి స్వింగ్ లో వున్న యంగ్ హీరోతో సినిమా చేసే చాన్స్ వ‌చ్చింద‌నే రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. నిజంగా స‌క్సెస్ ప‌వ‌ర్ అంటే ఇదేనేమో క‌దా.!
First Published:  6 March 2016 1:30 PM GMT
Next Story