Telugu Global
Cinema & Entertainment

పవన్ కల్యాణ్ వీణ స్టెప్పు

వీణ స్టెప్ అంటే చాలు తెలుగు సినీ అభిమాని ఎవరైనా గుర్తుపట్టేస్తాడు. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన ఆ వీణ  స్టెప్పును ఎవరూ మరిచిపోరు. కలకాలం గుర్తుండిపోతుంది ఆ మూమెంట్. ఆ తర్వాత సునీల్ లాంటి ఎంతోమంది కమెడియన్లు ఆ వీణ స్టెప్పును సరదాగా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ కూడా ఆ వీణ స్టెప్పుపై మనసుపడ్డాడు. తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ వీణ స్టెప్పు వేయబోతున్నాడు. […]

పవన్ కల్యాణ్ వీణ స్టెప్పు
X
వీణ స్టెప్ అంటే చాలు తెలుగు సినీ అభిమాని ఎవరైనా గుర్తుపట్టేస్తాడు. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన ఆ వీణ స్టెప్పును ఎవరూ మరిచిపోరు. కలకాలం గుర్తుండిపోతుంది ఆ మూమెంట్. ఆ తర్వాత సునీల్ లాంటి ఎంతోమంది కమెడియన్లు ఆ వీణ స్టెప్పును సరదాగా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ కూడా ఆ వీణ స్టెప్పుపై మనసుపడ్డాడు. తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ వీణ స్టెప్పు వేయబోతున్నాడు. ఇంద్ర సినిమాలో చిరు వేసిన స్టెప్పును యాజ్ ఇటీజ్ గా దించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సినిమాలో ఇది తమాషాగా చూపించబోతున్నాడా… లేక కావాలనే ఈ స్టెప్పును యాడ్ చేశారా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో చిరంజీవి పాటను పవన్ రీమిక్స్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరు స్టెప్పును కూడా పవన్ అనుకరిస్తున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. తాజా వార్తలతో చిరు-పవన్ మధ్య దూరం పూర్తిగా తగ్గినట్టు భావించవచ్చు.
Click on Image to Read:
ram-charan-chiru-birthday
ramcharan-upasana
chiru-ramcharan
allu-arjun
First Published:  7 March 2016 12:05 AM GMT
Next Story