Telugu Global
Cinema & Entertainment

వేలానికి పెళ్లి ఫొటోలు ?

బాలీవుడ్ అందాల భామ ప్రీతిజింటా వివాహం ఇటీవ‌లే ఆమె బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ ఇన‌ఫ్ తో జ‌రిగింది. అస‌లు పెళ్లి గురించి ప్రీతి బెస్ట్ ప్రెండ్స్ కొంద‌రు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో స‌మాచారం ఇచ్చే వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. అంత సాధార‌ణంగా పెళ్లి చేసుకుంది. అయితే ఎంత సింపుల్ గా పెళ్లి జ‌రిగిన ఈ రోజుల్లో సెలిబ్రిటీల‌వి వెంట‌నే సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ద‌ర్శ‌న‌మిస్తాయి. కానీ ప్రీతి త‌న పెళ్లి ఫోటోలు.. ఎక్క‌డ […]

వేలానికి పెళ్లి ఫొటోలు ?
X

బాలీవుడ్ అందాల భామ ప్రీతిజింటా వివాహం ఇటీవ‌లే ఆమె బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ ఇన‌ఫ్ తో జ‌రిగింది. అస‌లు పెళ్లి గురించి ప్రీతి బెస్ట్ ప్రెండ్స్ కొంద‌రు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో స‌మాచారం ఇచ్చే వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. అంత సాధార‌ణంగా పెళ్లి చేసుకుంది. అయితే ఎంత సింపుల్ గా పెళ్లి జ‌రిగిన ఈ రోజుల్లో సెలిబ్రిటీల‌వి వెంట‌నే సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ద‌ర్శ‌న‌మిస్తాయి. కానీ ప్రీతి త‌న పెళ్లి ఫోటోలు.. ఎక్క‌డ లీక్ కాలేదు. ఎందుకు అంత గోప్యంగా ఉంచాల్సి వ‌చ్చిందంటే.. పెళ్లికి ముందే త‌మ ఫోటోల్ని వేలం వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. వేలం వేయ‌గా వ‌చ్చిన మొత్తాన్నీ ప్రీతికి చెందిన ధార్మిక సంస్థ‌కు విరాళంగా ఇవ్వ‌నున్నారు. అదే విష‌యాన్ని త‌మ పెళ్లి రోజు వ‌చ్చిన కొద్ది మంది అథితుల‌కు కూడ ముందుగానే సున్నితంగా చెప్పార‌ట‌.

ఇంత‌కి ప్రీతికి ఈ పెళ్లి ఎలా కుదిరింది అంటే..? ప్రీతికి ద‌గ్గ‌ర బంధువులు అమెరికాలో ఉన్నారు. దీంతో ఆమో త‌రచుగా అమెరికాకు వెళ్లేది. అప్పుడు జెనీ ప‌రిచ‌య‌మ‌య్యాడు. నెస్ వాడియా పై ప్రీతి కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు విష‌యంలో ప్రీతికి జెనీ ఎంతో సాయం చేశాడ‌ట. అలా ఇద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం..పరిణయానీకి దారి తీసిందన్న‌మాట‌. మొత్తం మీద ప్రీతి త‌న పెళ్లి ఫోటోలు వేలం వేసి వ‌చ్చిన ఆదాయంతో ఒక మంచి ప‌ని చేయ‌బోతుందిన్న‌మాట‌.

First Published:  7 March 2016 6:16 AM GMT
Next Story