Telugu Global
NEWS

ఆదిరెడ్డీ... పద్ధతి మార్చుకో…

జమ్మలమడుగులో ఒకే అరలో చంద్రబాబు బలవంతంగా ఇరికించిన రెండు కత్తుల మధ్య అప్పుడే రచ్చమొదలైంది.  తనను ఎదుటివారు ఇబ్బంది పెడితే అందుకు రెట్టింపు ఇబ్బందులు తాను సృష్టిస్తానని  ఇటీవల ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. పద్దతి మార్చుకోవాలన్నారు. నియోజకవర్గంలో తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించేలా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  మాటల్లో ఫ్యాషన్‌, చేతల్లో ఫ్యాక్షన్ అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాటల్లో కాదు మనసులోనూ మార్పురావాలన్నారు. జమ్మలమడుగులో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉండడం […]

ఆదిరెడ్డీ... పద్ధతి మార్చుకో…
X

జమ్మలమడుగులో ఒకే అరలో చంద్రబాబు బలవంతంగా ఇరికించిన రెండు కత్తుల మధ్య అప్పుడే రచ్చమొదలైంది. తనను ఎదుటివారు ఇబ్బంది పెడితే అందుకు రెట్టింపు ఇబ్బందులు తాను సృష్టిస్తానని ఇటీవల ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. పద్దతి మార్చుకోవాలన్నారు.

నియోజకవర్గంలో తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించేలా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాటల్లో ఫ్యాషన్‌, చేతల్లో ఫ్యాక్షన్ అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాటల్లో కాదు మనసులోనూ మార్పురావాలన్నారు. జమ్మలమడుగులో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉండడం వల్లే తాను ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకించాననని చెప్పారు. అయినా అధిష్టానం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని.. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆదితో కలిసి పనిచేసే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదన్నారు.

ఒకటి చేస్తే అందుకు బదులుగా రెండు చేస్తామని చెప్పి కార్యకర్తల్లో భయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రామసుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలతో జమ్మలమడుగులో నిప్పు లోలోన రగులుతూనే ఉందని మరోసారి వెల్లడైందని భావిస్తున్నారు.

Click on image to read:

balakrishna

roja1

balakrishna-band-baza

roja

balakrishna

chandrababu-naidu

anam-son

ravela

cbn-amitab-singapoor

amith-shah

chandrababu1

jagan-tdp-ravela

ravela-susheel

balakrishna-ravela

ravela1

chandrababu-naidu

ESL-Narasimhan1

First Published:  7 March 2016 12:12 AM GMT
Next Story