Telugu Global
WOMEN

ఎంతో కృషి...అంతే వివ‌క్ష‌!

కొన్ని ద‌శాబ్దాల వ్య‌వ‌ధిలో అత్యంత వేగంగా మ‌హిళ‌ల జీవితాల్లో అనూహ్య‌మైన మార్పులు వ‌చ్చాయి. ఇంత‌వేగంగా మ‌హిళ‌లు ముందుకు వ‌స్తార‌ని ఆనాడు మ‌హిళ‌ల జీవితాల్లో మార్పుల‌ను ఆశించిన అభ్య‌దయ‌వాదులు సైతం ఊహించి ఉండ‌రు. అయితే వారిపై వివ‌క్ష త‌గ్గిపోయింద‌ని,  వారికి స‌మాన హ‌క్కులు సిద్ధించాయ‌ని ఇప్ప‌టికీ చెప్ప‌లేము. అందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తున్నాయి ఈ అంశాలు- ప్ర‌పంచ వ్యాప్తంగా ఆహార ఉత్పాద‌నా రంగంలో 66శాతం ప‌ని మ‌హిళ‌లే చేస్తున్నారు, 50శాతం ఆహారాన్ని ఉత్ప‌త్తి చేస్తున్నారు. కానీ 10శాతం మాత్ర‌మే ఆదాయాన్ని […]

కొన్ని ద‌శాబ్దాల వ్య‌వ‌ధిలో అత్యంత వేగంగా మ‌హిళ‌ల జీవితాల్లో అనూహ్య‌మైన మార్పులు వ‌చ్చాయి. ఇంత‌వేగంగా మ‌హిళ‌లు ముందుకు వ‌స్తార‌ని ఆనాడు మ‌హిళ‌ల జీవితాల్లో మార్పుల‌ను ఆశించిన అభ్య‌దయ‌వాదులు సైతం ఊహించి ఉండ‌రు. అయితే వారిపై వివ‌క్ష త‌గ్గిపోయింద‌ని, వారికి స‌మాన హ‌క్కులు సిద్ధించాయ‌ని ఇప్ప‌టికీ చెప్ప‌లేము. అందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తున్నాయి ఈ అంశాలు-

  • ప్ర‌పంచ వ్యాప్తంగా ఆహార ఉత్పాద‌నా రంగంలో 66శాతం ప‌ని మ‌హిళ‌లే చేస్తున్నారు, 50శాతం ఆహారాన్ని ఉత్ప‌త్తి చేస్తున్నారు. కానీ 10శాతం మాత్ర‌మే ఆదాయాన్ని పొందుతున్నారు. ప్ర‌పంచ సంప‌ద‌లో ఒక్క‌శాతం మాత్ర‌మే మ‌హిళ‌ల వ‌ద్ద ఉంది.
  • మొత్తం 197దేశాల్లో 22మంది మ‌హిళ‌లు మాత్ర‌మే దేశాధినేత‌లుగా ఉన్నారు. అంటే కేవ‌లం 11.2శాతం మంది.
  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్త్రీపురుషుల జీవితాల్లో ఉన్న తేడాల‌పై వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం 2013లో ఓ నివేదిక స‌మ‌ర్పించింది. ఇందులో మ‌హిళ‌ల‌పై వివ‌క్ష‌ని త‌గ్గించ‌డానికి కృషి చేస్తున్న 136 దేశాల్లో భార‌త్ 101వ స్థానంలో ఉంది.
  • దాదాపు ప్ర‌తిదేశంలోనూ మ‌హిళ‌లు పురుషుల‌కంటే ఎక్కువ గంట‌లు ప‌నిచేస్తున్నారు. కానీ వారికంటే త‌క్కువ సంపాద‌న పొందుతున్నారు. ముఖ్యంగా పేద‌దేశాల్లో మ‌హిళ‌లకు మ‌రీ ఎక్కువ ప‌నిగంట‌లు ఉంటున్నాయి. ఎలాంటి భృతి, ప‌ని ప్ర‌దేశాల్లో స‌దుపాయాలు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు.
First Published:  8 March 2016 3:26 AM GMT
Next Story