Telugu Global
CRIME

బాయ్‌ప్రెండ్‌గా వ‌చ్చి కాల‌య‌ముడై...!

అమ్మాయిల జీవితాల్లో తండ్రులు, బాయ్‌ప్రెండ్స్‌, అన్న‌ద‌మ్ములు, టీచ‌ర్లు, బంధువులు ఇలా ద‌గ్గ‌రివారు విల‌న్లుగా మారుతున్న సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఇలా స‌న్నిహితుల చేతుల్లో మానప్రాణాల‌ను పోగొట్టుకుంటున్న వారిని ర‌క్షించ‌డం పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారుతోంది. గ్రేటర్ నోయిడాలోని ట్రిగ్గి గ్రామంలో సోమ‌వారం ఇలాంటి దారుణ‌మే జ‌రిగింది. ఒక మైన‌ర్ బాలిక (16)ఇంటికి వ‌చ్చి, ఆమె త‌ల్లి దండ్రులు ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనే ఆమెపై అత్యాచారం, హ‌త్యాయ‌త్నం చేశాడు ఆమె బాయ్‌ఫ్రెండ్ అజ‌య్ శ‌ర్మ.  సోమ‌వారం మ‌ధ్యాహ్నం బాలిక ఇంటికి […]

అమ్మాయిల జీవితాల్లో తండ్రులు, బాయ్‌ప్రెండ్స్‌, అన్న‌ద‌మ్ములు, టీచ‌ర్లు, బంధువులు ఇలా ద‌గ్గ‌రివారు విల‌న్లుగా మారుతున్న సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఇలా స‌న్నిహితుల చేతుల్లో మానప్రాణాల‌ను పోగొట్టుకుంటున్న వారిని ర‌క్షించ‌డం పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారుతోంది. గ్రేటర్ నోయిడాలోని ట్రిగ్గి గ్రామంలో సోమ‌వారం ఇలాంటి దారుణ‌మే జ‌రిగింది. ఒక మైన‌ర్ బాలిక (16)ఇంటికి వ‌చ్చి, ఆమె త‌ల్లి దండ్రులు ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనే ఆమెపై అత్యాచారం, హ‌త్యాయ‌త్నం చేశాడు ఆమె బాయ్‌ఫ్రెండ్ అజ‌య్ శ‌ర్మ.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం బాలిక ఇంటికి వ‌చ్చిన అజ‌య్, ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌రువాత ఆమె ఒంటికి నిప్పంటించాడు. బాలిక కేక‌లు విని తాము ఇంటి టెర్ర‌స్‌పైకి ప‌రిగెత్తిన‌ట్టుగా ఆమె త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన అజ‌య్ శ‌ర్మ (18) బాలిక వెంట‌బ‌డి వేధించేవాడ‌ని, అందుకే ఆమె ఇంటినుండి బ‌య‌ట‌కు కూడా వెళ్ల‌కుండా ఉంటోంద‌ని వారు పోలీసుల‌కు తెలిపారు. 60శాతం పైగా శ‌రీరం కాలిన బాలిక‌ను ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్ జంగ్ ఆసుప‌త్రిలో చేర్చారు. పోలీసులు అజ‌య్‌శ‌ర్మ‌ని అరెస్టు చేసి బాలిక వాంగ్మూలం న‌మోదు చేశారు. హార్మోన్ల అస‌మతౌల్యం హెచ్చుగా ఉండి, భావోద్వేగాల స‌మ‌న్వ‌యం సాధ్యంకాని టీనేజి పిల్ల‌లు ఇలా ప్రేమ ఉచ్చులో ప‌డి ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. త‌ల్లిదండ్రులు కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించినా చాలా దారుణాల‌ను నివారించే అవ‌కాశం ఉంది.

First Published:  8 March 2016 2:25 AM GMT
Next Story