Telugu Global
Cinema & Entertainment

నిహారిక మొదటి సినిమా మొదటి లుక్

ఇన్నాళ్లూ బుల్లితెరకు, లఘు చిత్రాలకు మాత్రమే పరిమితమైన నిహారిక… త్వరలోనే వెండితెరపై అలరించడానికి సిద్ధమౌతోంది. నిహారిక-నాగశౌర్య కలిసి నటిస్తున్న ఒక మనసు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా…. అప్పట్లో అగిపోయిందనే వార్తలు వచ్చినప్పటికీ మళ్లీ పట్టాలపైకి వచ్చింది. మొదటిసారిగా అధికారికంగా టీవీ9 ఛానెల్…. నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. కుదిరితే మెగా హీరోలందర్నీ ఒకే వేదికపైకి రప్పించి…. సినిమాకు భారీ […]

నిహారిక మొదటి సినిమా మొదటి లుక్
X

ఇన్నాళ్లూ బుల్లితెరకు, లఘు చిత్రాలకు మాత్రమే పరిమితమైన నిహారిక… త్వరలోనే వెండితెరపై అలరించడానికి సిద్ధమౌతోంది. నిహారిక-నాగశౌర్య కలిసి నటిస్తున్న ఒక మనసు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా…. అప్పట్లో అగిపోయిందనే వార్తలు వచ్చినప్పటికీ మళ్లీ పట్టాలపైకి వచ్చింది. మొదటిసారిగా అధికారికంగా టీవీ9 ఛానెల్…. నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. కుదిరితే మెగా హీరోలందర్నీ ఒకే వేదికపైకి రప్పించి…. సినిమాకు భారీ ప్రమోషన్ కల్పించే ఉద్దేశంతో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి…. విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.

First Published:  8 March 2016 3:08 AM GMT
Next Story