Telugu Global
Cinema & Entertainment

నాగ్ సినిమా పని ప్రారంభించిన దర్శకేంద్రుడు

నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే ఇప్పుడు అందరికీ భక్తిరస చిత్రాలే గుర్తొస్తాయి. ఒకప్పుడు మాంఛి రొమాంటిక్ ఎంటర్ టైనర్లు తీసిన ఈ కాంబినేషన్…. ఇప్పుడు భక్తిరస చిత్రాలకు కేరాఫ్ గా మారింది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి లాంటి చిత్రాల్ని తెరకెక్కించారు. తాజాగా వెంకటేశ్వరస్వామిపై మరో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. హథీరామ్ బాబా జీవిత చరిత్రను చిత్రంగా తీసుకొస్తామని గతంలోనే రాఘవేంద్రరావు, నాగార్జున ప్రకటించినప్పటికీ… ఆ సినిమా డీటెయిల్స్ మాత్రం తెలియరాలేదు. ఎట్టకేలకు ఆ […]

నాగ్ సినిమా పని ప్రారంభించిన దర్శకేంద్రుడు
X
నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే ఇప్పుడు అందరికీ భక్తిరస చిత్రాలే గుర్తొస్తాయి. ఒకప్పుడు మాంఛి రొమాంటిక్ ఎంటర్ టైనర్లు తీసిన ఈ కాంబినేషన్…. ఇప్పుడు భక్తిరస చిత్రాలకు కేరాఫ్ గా మారింది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి లాంటి చిత్రాల్ని తెరకెక్కించారు. తాజాగా వెంకటేశ్వరస్వామిపై మరో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. హథీరామ్ బాబా జీవిత చరిత్రను చిత్రంగా తీసుకొస్తామని గతంలోనే రాఘవేంద్రరావు, నాగార్జున ప్రకటించినప్పటికీ… ఆ సినిమా డీటెయిల్స్ మాత్రం తెలియరాలేదు. ఎట్టకేలకు ఆ భక్తిరస చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. తిరుపతిలో సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాఘవేంద్రరావు కూర్చున్నారు. హథీరామ్ బాబాకు సంబంధించిన కొన్ని పాటల్ని కంపోజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వివరాల్ని ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తారు.
First Published:  8 March 2016 12:01 AM GMT
Next Story