Telugu Global
CRIME

అత్యాచారాన్ని ఎదిరించినా...వ్య‌ధ త‌ప్ప‌లేదు!

ఒకడు కీచ‌కుడై వేధించాడు, ఆమె ఎదిరించి పోలీస్ కేసు పెట్టింది. ప‌గ‌బ‌ట్టిన ఆ కీచ‌కుని కుటుంబీకులు వ‌చ్చి ఆమెపై హ‌త్యాప్ర‌య‌త్నం చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్, అలీగ‌ర్ జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ అమ్మాయిపై ఓ దుండ‌గుడు అత్యాచార ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె అత‌డిని ఎదుర్కొంది. ఆ అమ్మాయి కుటుంబీకులు కేసు పెట్ట‌డంతో పోలీసులు ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. అయితే ఆ క‌క్షని మ‌నసులో పెట్టుకున్న అత‌ని కుటుంబ స‌భ్యులు యువ‌తి […]

ఒకడు కీచ‌కుడై వేధించాడు, ఆమె ఎదిరించి పోలీస్ కేసు పెట్టింది. ప‌గ‌బ‌ట్టిన ఆ కీచ‌కుని కుటుంబీకులు వ‌చ్చి ఆమెపై హ‌త్యాప్ర‌య‌త్నం చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్, అలీగ‌ర్ జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ అమ్మాయిపై ఓ దుండ‌గుడు అత్యాచార ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె అత‌డిని ఎదుర్కొంది. ఆ అమ్మాయి కుటుంబీకులు కేసు పెట్ట‌డంతో పోలీసులు ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. అయితే ఆ క‌క్షని మ‌నసులో పెట్టుకున్న అత‌ని కుటుంబ స‌భ్యులు యువ‌తి ఇంటికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆమె అక్క, త‌మ్ముడు ఇంటి పై అంత‌స్తులో ఉన్నారు. దాంతో ఆ అమ్మాయి ఒక్క‌తే వారికి దొరికిపోయింది. దుండ‌గులు ఆమె ఒంటికి నిప్పంటించారు. బాధ‌తో ఆమెపెట్టిన కేక‌ల‌ను విని పైనుండి ఆమె అక్కా, త‌మ్ముడు దిగి వ‌చ్చారు. సోద‌రిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలు ప్ర‌స్తుతం చికిత్స‌పొందుతోంది. అయితే ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, అందుకే ఆమె వాంగ్మూలాన్ని న‌మోదు చేయ‌లేక‌పోయామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. సంఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. నిందితుడి కుటుంబమే త‌మ కూతురిపై హ‌త్యాయ‌త్నం చేసింద‌ని బాధితురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తుండ‌గా, ఆ కుటుంబం నుండి బెదిరింపులు రావ‌డంతో యువ‌తి త‌న‌కు తానుగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిందా అనే కోణంలో కూడా వారు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  9 March 2016 2:23 AM GMT
Next Story