Telugu Global
National

ఇక‌పై  ఆఫీసుల్లో వారానికోసారి  ఖాదీ క‌ళ‌క‌ళ‌లు!

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప్ర‌తి శుక్ర‌వారం ఖాదీని ధ‌రించేలా ఓ నూత‌న‌ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న చిన్న‌పాటి నేత‌ప‌నివారికి, ఖాదీ ప‌రిశ్ర‌మ‌కు ఇది ఎంతో మేలు చేస్తుంద‌ని క‌మిష‌న్ భావిస్తోంది. ప్ర‌భుత్వంతో ఈ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని, అలాగే ఒక్క‌రోజు ఖాదీని ధ‌రించ‌వ‌ల‌సిందిగా ఒక విజ్ఞ‌ప్తిని ఉద్యోగుల ముందుకు తీసుకువెళ‌తామ‌ని ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ఛైర్మ‌న్ వికె […]

ఇక‌పై  ఆఫీసుల్లో వారానికోసారి  ఖాదీ క‌ళ‌క‌ళ‌లు!
X

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప్ర‌తి శుక్ర‌వారం ఖాదీని ధ‌రించేలా ఓ నూత‌న‌ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న చిన్న‌పాటి నేత‌ప‌నివారికి, ఖాదీ ప‌రిశ్ర‌మ‌కు ఇది ఎంతో మేలు చేస్తుంద‌ని క‌మిష‌న్ భావిస్తోంది. ప్ర‌భుత్వంతో ఈ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని, అలాగే ఒక్క‌రోజు ఖాదీని ధ‌రించ‌వ‌ల‌సిందిగా ఒక విజ్ఞ‌ప్తిని ఉద్యోగుల ముందుకు తీసుకువెళ‌తామ‌ని ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ఛైర్మ‌న్ వికె స‌క్సేనా అన్నారు.

అయితే ఇదంతా త‌ప్ప‌నిస‌రిగా కాక ఉద్యోగులు స్వ‌చ్ఛందంగా పాటించేలా ఉంటుంద‌ని, దీంతో ఖాదీ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు భారీగా పెరుగుతాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. రైల్వే, డిఫెన్స్ కాక ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో దాదాపు 35ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ విధానానికి ఓకే చెబితే అమ్మ‌కాల‌పై మంచి ప్ర‌భావం ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు.

ప్ర‌భుత్వ‌మే కాక చాలామంది అధికారులు ఈ ఆలోచ‌న‌ప‌ట్ల వ్య‌క్తిగ‌తంగానూ సుముఖంగా ఉన్నారు. ఇప్ప‌టికే హ్యాండ్‌లూమ్ దుస్తులు వాడుతున్నామ‌ని, ఖాదీని వారానికి ఒక‌సారి వాడ‌టం పెద్ద స‌మస్య కాద‌ని వారంటున్నారు. అలాగే ఫ్యాబ్ఇండియా, రేమండ్ వంటి సంస్థ‌ల‌తో కూడా త‌మ రిటైల్ అమ్మ‌కాలు పెంచుకునేందుకు ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ఒప్పందాలు చేసుకుంటున్న‌ది.

నిజానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తాను ధ‌రించే దుస్తుల‌తో ఖాదీకి అంబాసిడ‌ర్‌గా మారిపోయిన నేప‌థ్యంలో ఈ దుస్తుల అమ్మ‌కాలు ఇప్ప‌టికే బాగా పెరిగాయి. డిఫెన్స్‌, రైల్వే, ఎయిర్ ఇండియా, ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో యూనిఫామ్‌లుగా కూడా ఖాదీని ప్ర‌వేశ‌పెట్టాలని ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ కోరుతోంది.

తాము ద‌యా ధ‌ర్మంగా ఈ కోరిక‌లు కోర‌డం లేద‌ని నాణ్య‌త‌, స‌రైన ధ‌ర‌ల‌తో ఇత‌ర వ‌స్త్ర కంపెనీల‌తో పోటీప‌డుతున్నామ‌ని స‌క్సేనా అంటున్నారు. ఇటీవ‌ల ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ రైల్వేస్ నుండి 40 కోట్ల రూపాయ‌ల టెండ‌రు పొందింది. అలాగే జెకె సిమెంట్ లాంటి కొన్ని ప్ర‌యివేటు కంపెనీలు సైతం ఖాదీ యూనిఫామ్ వైపు మొగ్గు చూపుతున్నాయ‌ని స‌క్సేనా తెలిపారు.

First Published:  8 March 2016 8:01 PM GMT
Next Story