Telugu Global
Cinema & Entertainment

మామా కోడ‌ళ్ల మ‌ధ్య స‌వాల్..

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒకేసారి పెద్ద చిత్రాలు ఢీ అంటే ఢీ అన‌డం సాధార‌ణ‌మే. అయితే ఈసారి బాలీవుడ్ లో మామా కోడ‌ళ్లు న‌టించిన చిత్రాలు పోటి ప‌డుతుండ‌టం విశేషం. అమితాబ‌చ్చ‌న్ న‌టించిన టీన్ చిత్రం… అలాగే ఐశ్వ‌ర్య న‌టించిన స‌ర‌బ‌జిత్ చిత్రాలు మే 20వ‌ తేదీన ఒకే రోజు రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి.స‌ర‌బ్ జిత్ జీవిత క‌థ ఆధారంగా చేస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను ర‌ణ‌దీప్ హూడా పోషిస్తున్నారు. మేరి కోమ్ త‌రువాత […]

మామా కోడ‌ళ్ల మ‌ధ్య స‌వాల్..
X

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒకేసారి పెద్ద చిత్రాలు ఢీ అంటే ఢీ అన‌డం సాధార‌ణ‌మే. అయితే ఈసారి బాలీవుడ్ లో మామా కోడ‌ళ్లు న‌టించిన చిత్రాలు పోటి ప‌డుతుండ‌టం విశేషం. అమితాబ‌చ్చ‌న్ న‌టించిన టీన్ చిత్రం… అలాగే ఐశ్వ‌ర్య న‌టించిన స‌ర‌బ‌జిత్ చిత్రాలు మే 20వ‌ తేదీన ఒకే రోజు రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి.స‌ర‌బ్ జిత్ జీవిత క‌థ ఆధారంగా చేస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను ర‌ణ‌దీప్ హూడా పోషిస్తున్నారు. మేరి కోమ్ త‌రువాత ఓమాండ్ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో స‌ర‌బ్ జిత్ సింగ్ సోద‌రి ద‌ల్బీర్ కౌర్ పాత్ర‌ను ఐశ్వ‌ర్య రాయ్ పోసిస్తున్నారు. ఇక అమితాబ్ న‌టిస్తున్న టీన్ చిత్రంలో త‌న రోల్ కోసం అమితాబ్ బాగానే క‌ష్ట ప‌డుతున్నారు. విద్యాబాల‌న్ , న‌వాజుద్దీన్ సిద్దిఖీ కీ రోల్స్ చేస్తున్నారు. రిబు దాస్ గుస్తా ద‌ర్శ‌కుడు. మొత్తం మీద బ‌చ్చ‌న్ కుటుంబం మ‌ధ్య పోటి ఉండ‌టం బి టౌన్ లో ఆస‌క్తి క‌రంగా మారింది. మ‌రి మామ , కోడ‌ళ్ల లో ఎవ‌రు బాక్సాపీస్ విజేత అనిపించుకుంటారో…!

First Published:  9 March 2016 6:20 AM GMT
Next Story