Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాకు డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఈమధ్యే భుజానికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్న చిరు… ఇప్పుడు కంప్లీట్ ఫిట్ గా ఉన్నాడు. ఓ వైపు తనయ శ్రీజ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే… మరోవైపు మేకోవర్ సాధించాడు. డాన్స్ పై కూడా పట్టు సాదించాడు. ఇంకోవైపు కత్తి సినిమా రీమేక్ కు వినాయక్ తుదిమెరుగులు కూడా దిద్దాడు. సో… అన్నీ కుదిరిపోయాయి. ఇప్పుడు తాజాగా డేట్ కూడా కుదిరినట్టు తెలుస్తోంది. మార్చి 28న శ్రీజ పెళ్లి […]

చిరంజీవి సినిమాకు డేట్ ఫిక్స్
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఈమధ్యే భుజానికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్న చిరు… ఇప్పుడు కంప్లీట్ ఫిట్ గా ఉన్నాడు. ఓ వైపు తనయ శ్రీజ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే… మరోవైపు మేకోవర్ సాధించాడు. డాన్స్ పై కూడా పట్టు సాదించాడు. ఇంకోవైపు కత్తి సినిమా రీమేక్ కు వినాయక్ తుదిమెరుగులు కూడా దిద్దాడు. సో… అన్నీ కుదిరిపోయాయి. ఇప్పుడు తాజాగా డేట్ కూడా కుదిరినట్టు తెలుస్తోంది. మార్చి 28న శ్రీజ పెళ్లి అయిపోయిన వెంటనే… కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని…. ఏప్రిల్ మూడో వారంలో కత్తి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురావాలని చిరంజీవి భావిస్తున్నారట. లైకా ప్రొడక్షన్స్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హీరోయిన్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారని టాక్. ఓ మంచి సందర్భం చూసి ఆమె పేరును బయటపెట్టాలనుకుంటున్నారట.
First Published:  8 March 2016 11:48 PM GMT
Next Story