Telugu Global
NEWS

అచ్చంపేటలో కారు హోరు... గల్లంతైన టీడీపీ, కాంగ్రెస్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు  ఎదురులేకుండాపోతోంది.  గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికలు, వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన టీఆర్ఎస్.. ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అదే జోరు చూపిస్తోంది. అచ్చంపేట ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 20 వార్డులకు గాను 20 వార్డులను కారు సొంతం చేసుకుంది. విపక్షాలకు ఒక్కసీటు కూడా రాలేదు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా కారుదే […]

అచ్చంపేటలో కారు హోరు... గల్లంతైన టీడీపీ, కాంగ్రెస్‌
X

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేకుండాపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన టీఆర్ఎస్.. ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అదే జోరు చూపిస్తోంది. అచ్చంపేట ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 20 వార్డులకు గాను 20 వార్డులను కారు సొంతం చేసుకుంది. విపక్షాలకు ఒక్కసీటు కూడా రాలేదు.

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా కారుదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు వరంగల్‌లో టీఆర్‌ఎస్ 44, కాంగ్రెస్ 4, బిజెపి 1, సీపీఎం 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. వరంగల్‌లో మొత్తం 58 వార్డులున్నాయి. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ 34, కాంగ్రెస్ 10, వైసీపీ 2 , ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ మొత్తం 50 వార్డులున్నాయి. అచ్చంపేట నగర పంచాయితితో పాటు, వరంగల్, ఖమ్మం కార్పోరేషనలల్లో కూడా టీడిపి తన ఉనికి పూర్తిగా కోల్పోయింది.

Click on image to read:

jalilkhan

bhumana

sharapova1

tdp-mlas

balakrishna1

adinarayana-reddy

ravela-son

mla-anitha

jagan-assembly

bali

jagan

First Published:  8 March 2016 10:31 PM GMT
Next Story