Telugu Global
CRIME

త‌న కాపురం కూలుతుంద‌నే భ‌యంతో ప్రేయ‌సిని హ‌త‌మార్చాడు!

ఎంతో ఇష్టంతో, వ్యామోహంతో మొద‌ల‌వుతున్న వివాహేత‌ర సంబంధాల ముగింపు క‌థ‌లు చాలావ‌ర‌కు ఒకే విధంగా ఉంటాయి. అవి విషాదంగానో, లేదా దారుణ‌మైన నేరాలుగానో ముగుస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న న‌వీన్ కుమార్‌, అదే సంస్థ‌లో ఉద్యోగిని అయిన పుణ్య‌సాగ‌ర్‌ల అనుబంధం కూడా అలాగే ముగిసింది. న‌వీన్ కుమార్ (32) కి వివాహం కాలేద‌నుకుని పుణ్య‌సాగ‌ర్ (28) అత‌నితో ప్రేమ‌లో ప‌డింది. వారి మ‌ధ్య అనుబంధం కొన‌సాగుతుండ‌గా అత‌నికి పెళ్ల‌యింద‌ని, పిల్ల‌లు కూడా ఉన్నార‌ని పుణ్య‌సాగ‌ర్‌కి తెలిసింది. […]

ఎంతో ఇష్టంతో, వ్యామోహంతో మొద‌ల‌వుతున్న వివాహేత‌ర సంబంధాల ముగింపు క‌థ‌లు చాలావ‌ర‌కు ఒకే విధంగా ఉంటాయి. అవి విషాదంగానో, లేదా దారుణ‌మైన నేరాలుగానో ముగుస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న న‌వీన్ కుమార్‌, అదే సంస్థ‌లో ఉద్యోగిని అయిన పుణ్య‌సాగ‌ర్‌ల అనుబంధం కూడా అలాగే ముగిసింది.

న‌వీన్ కుమార్ (32) కి వివాహం కాలేద‌నుకుని పుణ్య‌సాగ‌ర్ (28) అత‌నితో ప్రేమ‌లో ప‌డింది. వారి మ‌ధ్య అనుబంధం కొన‌సాగుతుండ‌గా అత‌నికి పెళ్ల‌యింద‌ని, పిల్ల‌లు కూడా ఉన్నార‌ని పుణ్య‌సాగ‌ర్‌కి తెలిసింది. షాక్‌కి గుర‌యిన ఆమె న‌వీన్ కుమార్ త‌న‌ని మోసం చేశాడ‌నే కోపంతో, త‌మ విష‌యాన్ని అత‌ని భార్య‌కి చెబుతాన‌ని బెదిరించ‌సాగింది. దాంతో అత‌ను పుణ్య‌ని హ‌త్య‌చేయాల‌ని ప‌థ‌కం వేసుకున్నాడు.

మంచిమాట‌లు చెప్పి, ఢిల్లీ శివార్ల‌లో ఉన్న‌ మంగోల్‌పురికి ఆమెని కారులో తీసుకువెళ్లాడు. త‌మ ప్రేమ‌క‌థ‌కి ఏదోఒక ప‌రిష్కారం ఆలోచిద్దామ‌ని ఆమెను తీసుకువెళ్లిన న‌వీన్ కుమార్‌ ఆమె ప్రాణాల‌ను తీశాడు. ఎవ‌రూలేని నిర్మానుష్య ప్రాంతంలో కారుని ఆపి పుణ్య‌సాగ‌ర్ త‌ల‌ని ఫుట్‌పాత్‌కి మోది చంపేశాడు. ఆమె మెడ ప‌ట్టుకుని ప‌దేప‌దే కొడుతూ తీవ్రంగా గాయ‌ప‌ర‌చాడు. ఇక ఆమె మ‌ర‌ణించ‌డం ఖాయ‌మ‌నుకున్నాక కారులో ఎక్కించుకుని హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లి యాక్సిడెంట్ అయ్యింద‌ని చెప్పాడు. అయితే ఇదంతా ఆ దారిన పోతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు చూశారు. పోలీసుల‌కు కాల్ చేసి విష‌యం చెప్పారు. కానీ పోలీసులు అక్క‌డ‌కు చేరేస‌రికే న‌వీన్ కుమార్ పుణ్య‌ని తీసుకుని అక్క‌డి నుండి వెళ్లిపోయాడు. హ‌త్య‌ని చూసిన ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు మాత్రం న‌వీన్‌ని వెంబ‌డించారు. అత‌ను జైపూర్ గోల్డెన్ హాస్ప‌ట‌ల్‌లో పుణ్య‌ని చేర్చ‌డం చూసి తిరిగి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి న‌వీన్ కుమార్‌ని అరెస్టు చేశారు. ఈ విష‌యంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్టుగా పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  10 March 2016 3:05 AM GMT
Next Story