Telugu Global
CRIME

ఐదుసెక‌న్లు ఫోన్ ఆన్ చేశారు...ప‌ట్టుబ‌డ్డారు!

రోడ్డుమీద న‌డుస్తున్న వ్య‌క్తుల వ‌ద్ద కూడా అల‌వోక‌గా  సెల్‌పోన్లను దొంగిలిస్తున్న ఒక ముఠాని హైద‌రాబాద్, గాంధీన‌గ‌ర్ పోలీసులు  అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు మైన‌ర్లున్నారు. గాంధీన‌గ‌ర్ పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం ఒక ఐటిఐ విద్యార్థి, ఇద్ద‌రు ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు, ఒక డిప్లొమా స్టూడెంటు క‌లిసి ఈ దొంగ‌త‌నాల‌ను చేస్తున్నారు. వీరివ‌ద్ద‌నుండి మొత్తం నాలుగు ఫోన్ల‌ను, రెండు బైక్‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండునెల‌ల క్రితం విష్ణుప్రసాద్ అనే వ్య‌క్తి ట్యాంక్‌బండ్‌మీద మార్నింగ్ వాక్ చేస్తుండ‌గా […]

ఐదుసెక‌న్లు ఫోన్ ఆన్ చేశారు...ప‌ట్టుబ‌డ్డారు!
X

రోడ్డుమీద న‌డుస్తున్న వ్య‌క్తుల వ‌ద్ద కూడా అల‌వోక‌గా సెల్‌పోన్లను దొంగిలిస్తున్న ఒక ముఠాని హైద‌రాబాద్, గాంధీన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు మైన‌ర్లున్నారు. గాంధీన‌గ‌ర్ పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం ఒక ఐటిఐ విద్యార్థి, ఇద్ద‌రు ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు, ఒక డిప్లొమా స్టూడెంటు క‌లిసి ఈ దొంగ‌త‌నాల‌ను చేస్తున్నారు. వీరివ‌ద్ద‌నుండి మొత్తం నాలుగు ఫోన్ల‌ను, రెండు బైక్‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండునెల‌ల క్రితం విష్ణుప్రసాద్ అనే వ్య‌క్తి ట్యాంక్‌బండ్‌మీద మార్నింగ్ వాక్ చేస్తుండ‌గా అత‌ని చేతిలోని ఐఫోన్ 5ఎస్‌ని ఒక కుర్రాడు లాక్కుని పారిపోయాడు. ఐఫోన్‌కున్న ఐఎమ్ఇఐ నెంబ‌రు ఆధారంగా ఫోన్‌ని ప‌ట్టుకుందామంటే దాన్ని స్విచ్ఛాఫ్ చేశారు. అయితే ఫోన్‌ని దొంగిలించిన ఒక నెల‌కు దుండ‌గులు ఫోన్లో సిమ్ వేసి కేవ‌లం ఐదు సెక‌న్ల‌పాటు అది ప‌నిచేస్తుందో లేదో టెస్ట్ చేశారు. త‌రువాత స్విచ్ఛాఫ్ చేశారు. ఆ మాత్రం స‌మ‌యంతోనే ఫోన్ దొంగ‌ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. న‌లుగురు విద్యార్థులు క‌లిసి హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌, చిక్క‌డ‌ప‌ల్లి, లాల్‌గూడా ప్రాంతాల్లో కొన్ని నెల‌లుగా ఫోన్ల‌ను దొంగ‌తనాలు చేస్తున్న‌ట్టుగా గుర్తించారు. వాటిని అమ్మి జ‌ల్సాల‌కు, గంజాయికి ఖ‌ర్చుపెట్టుకుంటున్న‌ట్టుగా పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  11 March 2016 3:42 AM GMT
Next Story