నమ్మక ద్రోహి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు… జైల్లో కలుద్దాం..!

నిర్మాత బండ్ల గణేష్‌కు పుట్టిన రోజు నాడు ఊహించని ట్వీట్ అందింది. నమ్మకద్రోహి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ వచ్చింది. అలా ట్వీట్ చేసింది  నటుడు సచిన్ జోషి.  త్వరలోనే జైల్లో కలుస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

‘నా ప్రియమైన నమ్మకద్రోహికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. త్వరలోనే నిన్ను జైల్లో కలుస్తాను. అతనితో ఎవరైనా సినిమా చేస్తే రిలీజ్ కానివ్వను జాగ్రత్త’ అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అయితే సచిన్ ట్వీట్‌కు గణేష్ మాత్రం స్పందించడం లేదు.  సినీరంగంలో వివాదాలు కామనే అయినా ఇలా బహిరంగంగా తిట్టుకోవడం మాత్రం చాలా అరుదు.

వీరి మధ్య ఈ రేంజ్‌లో గొడవ చెలరేగడానికి కారణం. టెంపర్ మూవీ సమయంలో ఆర్థిక లావాదేవీలే. టెంపర్ సినిమా టైమ్‌లో బండ్ల గణేష్‌కు సచిన్ జోషి ఆర్ధిక సాయం చేశారు. కానీ సినిమా రిలీజ్ అయినా గణేష్ మాత్రం తిరిగి డబ్బు చెల్లించలేదని చెబుతుంటారు. సచిన్ జోషి ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి స్పందన లేదని ఆరోపణ.  ఈ విషయంలో బండ్ల గణేష్‌కు సచిన్ జోషి కోర్టు నోటీసులు కూడా పంపారు. ఈ వివాదం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే ఆ కోపంతో నమ్మకద్రోహి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సచిన్ జోషి ట్వీట్ చేశారు.

Click on Image to Read:

kcr-kadiyam

kottapalli-geetha

jagan-smile-in-assembly

komati-reddy

ys-chandrababu

vijay-mallya

pawan

pawan-maruthi

sarinodu

chiru

sardar-gabbarsingh-1