Telugu Global
NEWS

శ్రీమన్నారాయణతో సారీ చెప్పించిన ట్రిబ్యునల్

మూడు పంటలు పండే ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ శ్రీమన్నారాయణ విరాళాల విషయంలో క్షమాపణ చెప్పారు. ఫేస్‌ బుక్ వేదికగా  విరాళాల కోసం   పిలుపునివ్వడంపై ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది.  ప్రచారం కోసం పాకులాడవద్దని సూచించింది.   శ్రీమన్నారాయణ విరాళాల సేకరణపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించగా వెంటనే క్షమాపణ చెప్పాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో  శ్రీమన్నారాయణ… సీఆర్‌డీఏతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌కు క్షమాపణ […]

శ్రీమన్నారాయణతో సారీ చెప్పించిన ట్రిబ్యునల్
X

మూడు పంటలు పండే ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ శ్రీమన్నారాయణ విరాళాల విషయంలో క్షమాపణ చెప్పారు. ఫేస్‌ బుక్ వేదికగా విరాళాల కోసం పిలుపునివ్వడంపై ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. ప్రచారం కోసం పాకులాడవద్దని సూచించింది. శ్రీమన్నారాయణ విరాళాల సేకరణపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించగా వెంటనే క్షమాపణ చెప్పాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో శ్రీమన్నారాయణ… సీఆర్‌డీఏతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌కు క్షమాపణ చెప్పారు. రాజధాని భూముల విషయంలో పోరాటం చేసేందుకు విరాళాలు ఇవ్వాలని ఆయన ఇటీవల ఫేస్ బుక్ ద్వారా కోరారు. అమరావతికి పర్యావరణ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

Click on Image to Read:

polavaram-chandrababu

ttdp

murdra

jagan

bjp-tdp

ysrcp-tdp

BJP-CPI-CPM

First Published:  11 March 2016 12:52 AM GMT
Next Story