Telugu Global
NEWS

కార్పొరేట్లు ఇస్తున్నాయి...రాజకీయ పార్టీలు పుచ్చుకుంటున్నాయి!

రాజ‌కీయ‌పార్టీలు, కార్పొరేట్ కంపెనీలు చెట్టాప‌ట్టాలేసుకుని సాగ‌టం కొత్త విష‌య‌మేం కాదు. రాజ‌కీయ పార్టీల‌ను ఆనంద‌ప‌ర‌చ‌డానికి కార్పొరేట్ కంపెనీలు ల‌క్ష‌లు,  కోట్ల‌లో విరాళాలు ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డొనేష‌న్లు భారీగా ఉన్నాయ‌ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్ల‌డించింది. ఒక్కోకంపెనీ రెండుమూడు పార్టీల‌కు కూడా విరాళాలు ఇస్తోంది. రాజ‌కీయ పార్టీల ఇన్‌క‌మ్ ట్యాక్స్ నివేదిక‌ల ఆధారంగా ఏ కంపెనీలు ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చాయి… అనే వివ‌రాల‌ను ప్ర‌జాస్వామ్య సంస్క‌ర‌ణ‌ల సంస్థ […]

కార్పొరేట్లు ఇస్తున్నాయి...రాజకీయ పార్టీలు పుచ్చుకుంటున్నాయి!
X

రాజ‌కీయ‌పార్టీలు, కార్పొరేట్ కంపెనీలు చెట్టాప‌ట్టాలేసుకుని సాగ‌టం కొత్త విష‌య‌మేం కాదు. రాజ‌కీయ పార్టీల‌ను ఆనంద‌ప‌ర‌చ‌డానికి కార్పొరేట్ కంపెనీలు ల‌క్ష‌లు, కోట్ల‌లో విరాళాలు ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డొనేష‌న్లు భారీగా ఉన్నాయ‌ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్ల‌డించింది. ఒక్కోకంపెనీ రెండుమూడు పార్టీల‌కు కూడా విరాళాలు ఇస్తోంది. రాజ‌కీయ పార్టీల ఇన్‌క‌మ్ ట్యాక్స్ నివేదిక‌ల ఆధారంగా ఏ కంపెనీలు ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చాయి… అనే వివ‌రాల‌ను ప్ర‌జాస్వామ్య సంస్క‌ర‌ణ‌ల సంస్థ వెల్ల‌డించింది. అయితే తెలంగాణ‌లో అతి పెద్ద పార్టీ అయిన టిఆర్ఎస్ మాత్రం గత మూడేళ్లుగా త‌న ఆడిట్ రిపోర్టుల‌ను వెల్ల‌డించ‌లేదు. అంత‌కుముందు సంవ‌త్స‌రం అంటే 2010-11లో ఈ పార్టీ 26డొనేష‌న్ల రూపంలో 87.60ల‌క్ష‌ల రూపాయ‌లు పుచ్చుకుంది.

2010-11 నుండి 2014-15 వ‌ర‌కు టిడిపి 284 డొనేష‌న్ల ద్వారా 9.9998 కోట్ల రూపాయ‌లు అందుకుంది. ఎపి, తెలంగాణ‌ల్లో అత్యధికంగా డొనేష‌న్లు పొందిన ప్రాంతీయ పార్టీ ఇదే. వైఎస్ఆర్‌సిపి 2012-13లో 33.78ల‌క్ష‌ల‌ను పొంద‌గా, 2014-15 లో 7.06కోట్ల‌రూపాయ‌ల డొనేష‌న్లు పుచ్చుకుంది. హెటిరో, అర‌బిందో డ్ర‌గ్స్ కంపెనీలు, హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌, ప్లాటినా ఇన్‌ఫ్రాస‌ర్వీసెస్ త‌దిత‌ర కంపెనీలు డొనేష‌న్లు ఇచ్చాయి. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్‌సిపికి మూడు కోట్ల రూపాయ‌ల‌ను డొనేష‌న్‌గా ఇచ్చారు. అలాగే అదే సంవ‌త్స‌రం త‌మిళ‌నాడు నుండి దీప‌క్ జోసెఫ్ ప‌రాయ‌క‌న్ అనే వ్య‌క్తి వైఎస్ఆర్‌సిపికి కోటి రూపాయ‌లు విరాళం ఇచ్చారు. ఈ వ‌రుస‌లో డొనేష‌న్లు ఇచ్చి రాజ‌కీయ పార్టీల‌ను సంతోష‌పెడుతున్న కంపెనీలు చాలానే ఉన్నాయి.

Click on Image to Read:

bjp-president

roja1

photo

jagan-case-involved

bandla-ganesh

kcr-kadiyam

kottapalli-geetha

jagan-smile-in-assembly

komati-reddy

ys-chandrababu

vijay-mallya

First Published:  11 March 2016 11:50 AM GMT
Next Story