వెళ్తే విషయం తెలుసిపోతుందని చిరు డ్రాప్ అవుతున్నాడు…

పవన్-చిరంజీవి మధ్య ఇప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. మెగాబ్రదర్స్ ఇద్దరూ చక్కగా కలిసిపోయారు. దీంతో పవన్ కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశముందని అప్పట్లో వార్తలొచ్చాయి. పవన్ సినిమా యూనిట్ కూడా ఈ విషయాన్ని అప్పట్లో కొట్టిపారేయలేదు. దీంతో చిరు రాక తథ్యం అనుకున్నారంతా. కానీ తాజా సమాచారం ప్రకారం… పవన్ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి రావడం లేదు. సినిమా విడుదల ఆలస్యం అవుతుండడం…. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో…. ఆడియో విడుదల తేదీపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మరోవైపు… తన 150వ సినిమా కోసం చిరంజీవి తీవ్రంగా కష్టపడుతున్నాడు. నయా లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే మీడియా కంట కూడా పడట్లేదు. ఇలాంటి టైమ్ లో పవన్ ఆడియో ఫంక్షన్ కు వస్తే… విషయం పక్కదోవ పడుతుందని, సినిమాపై హైప్ తగ్గుతుందని భావిస్తున్నాడట. అందుకే ఆడియో ఫంక్షన్ కు రానని మెగాతమ్ముడికి సున్నితంగానే చెప్పినట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

madhupriya

bandla-ganesh

pawan

pawan-maruthi

sarinodu

chiru

sardar-gabbarsingh-1