అన్నవరం కొండమీద అశ్లీల నృత్యాలు!

అన్నవరం కొండమీద సత్య దేవుని సన్నిధిలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ఓ పెళ్లి బృందం సినిమా పాటలు పెట్టుకుని చిందేసింది. అశ్లీల పాటలు, హావభావాలతో ఆ ప్రాంత వాతావరణాన్ని మార్చేసింది. ఎంతోదూరం నుండి దేవుని మీద భక్తితో మనశ్శాంతి కోసం వచ్చే భక్తులకు అసౌకర్యాన్ని కలిగించింది. అన్నవరం కొండమీద ఉన్న హరిహరసదన్ బ్యాగ్రౌండ్లో వేదికని నిర్మించి తప్పతాగి రికార్డింగ్ నృత్యాలు చేసిందీ పెళ్లిబృందం. ఈ రికార్డింగ్‌ డ్యాన్సులకు స్థానిక టీడీపీ నాయకులు కొందరు హాజరు కావడం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం రాత్రి ఈ డ్యాన్సులను చూసిన వారు సెల్‌ ఫోన్లో చిత్రీకరించి మీడియాకు పంపినట్టుగా సమాచారం.

కొంతమంది భక్తులు సైతం దేవాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుపై స్పందించిన ఆలయ ఈఓ, ఈ నృత్యాలు చేసిన పెళ్లిబృందంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు సెక్యురిటీ గార్డులను ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు.

img-7 img5img2 img3 img-4  img-6

Click on Image to Read:

bjp-president

roja1

jagan-case-involved

jagan-sakshi

bandla-ganesh

kottapalli-geetha

123

jagan-smile-in-assembly

kcr-kadiyam

ys-chandrababu

trstdpcongress