జగన్‌ది ఒక దారి… ‘సాక్షి’ది మరో దారి…

జగన్‌ సాక్షి పేపర్‌ పెట్టాడు… అందులో పెట్టుబడులు పెట్టించడం వల్ల జైలుకు వెళ్లాల్సివచ్చింది. జీవితంలో చాలా కష్టాలు పడాల్సివచ్చింది. అలా పెట్టిన సాక్షి జగన్‌కి పూర్తిగా ఉపయోగపడుతుందా అంటే అనుమానమే. చంద్రబాబు స్వయంగా పెట్టని పత్రికలు, చానల్స్‌ ఆయన ఇమేజ్‌ బిల్డప్‌కు తీవ్రంగా కృషి చేస్తుంటే సాక్షి ఆయన డ్యామేజ్‌కి అప్పుడప్పుడు అంతకన్నా తీవ్రంగా కృషిచేస్తుంది.
హుదూద్‌ తుఫాను సమయంలో తుఫాన్‌ గురించి, అది సృష్టించబోయే మహా విలయం గురించి నాసాలాంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుగానే హెచ్చరించాయి. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఘోర నష్టం జరిగాక తన ఇమేజ్‌కి నష్టం జరగకుండా ఇమేజ్‌ బిల్డప్‌కోసం చంద్రబాబు విశాఖలో వాలిపోయాడు. ముఖ్యమంత్రి విధులు తప్ప కలెక్టర్‌… ఇంజనీర్లు… మున్సిపాలిటీ వాళ్లు… ఇలా అందరూ చేయాల్సిన పనుల్ని తాను ఒక్కడే చేసేశాడు. రోడ్డుకు అడ్డంపడ్డ చెట్లను కూడా కొట్టేశాడు.

అదే సమయంలో జగన్‌ కూడా విశాఖ వెళ్లాడు. ఈయన చేయాల్సిన పనులు ఈయన చేశాడు. ప్రెస్‌మీట్‌ పెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫేయిల్‌ అయ్యాడని, ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందడంలేదని విమర్శించాడు. విశాఖ కలెక్టర్‌కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడే తిష్టవేయడం వల్ల, అన్నీ తానై వ్యవహరించడం వల్ల మా పనులు మేము చేయలేకపోతున్నామని, ఈ క్లిష్ట సమయంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొనాల్సిన రెవిన్యూ యంత్రాంగమంతా ముఖ్యమంత్రితో వుండాల్సి రావడం వల్ల ఏమి చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే మరునాడు సాక్షి పత్రికలో చంద్రబాబు తెల్లవారుజామున నాలుగు గంటలనుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏవిధంగా కష్టపడిందీ, నిరంతరం కష్టపడుతూ ప్రజలను ఎలా ఆదుకున్నదీ, సహాయకార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నదీ ఫొటోలతో సహా అరపేజీ పెద్ద ఆర్టికల్‌ ఇచ్చి దాని క్రింద ప్రజలకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేయిల్‌ అయ్యాడని జగన్‌ అన్నట్లు ఒక చిన్న సింగిల్‌ కాలమ్‌ వార్త వేశారు.
జగన్‌ వ్యాఖ్యలకు జనం నవ్వుకున్నారు.

మొన్న ఈ మధ్య నాలుగు రోజులు సాక్షి జగన్‌కు బలే సహాయపడింది. రాజధాని భూముల కుంభకోణాన్ని ఎత్తిచూపింది. దాంతో తెలుగుదేశం ప్రభుత్వం గడగడలాడింది. వైఎస్‌ఆర్‌ అభిమానులు ఇన్ని రోజులకు సాక్షి పత్రిక మనకు ఉపయోగపడిందని సంతోషపడ్డారు.

మళ్లీ సాక్షి దారి సాక్షిదే… జగన్‌ దారి జగన్‌దే…

చంద్రబాబు యధావిధిగా పెట్టుబడులకోసం లండన్‌ వెళ్లాడు. ఆయనతో సాక్షి విలేకరి ఎవరూ వెళ్లలేదు. కానీ ప్రపంచ ప్రసిద్ధమైన పెద్ద పెద్ద సంస్థల చాంతాడంత లిస్టు ఇచ్చి వాళ్లందరూ చంద్రబాబును కలిసినట్టు, అమరావతిలో పెట్టుబడులు పెడుతామని హామీ ఇచ్చినట్లు దానిని సాక్షి దగ్గర వుండి చూసినంత గొప్పగా వార్త రాశారు. (ప్రెస్‌నోట్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది అని కాకుండా) అమరావతికి అవసరమైన నిధుల సమీకరణలో సాయం చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజి ముందుకు వచ్చినట్లు సాక్షి ప్రతినిధులు పక్కనే వుండి విన్న స్థాయిలో రాశారు. మొత్తం వార్త చదివితే ప్రపంచదేశాలు చంద్రబాబుకు ఎలా రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌ ఇస్తాయో, మల్టీనేషనల్‌ కంపెనీలు చంద్రబాబు ముందు ఎలా సాగిలపడతాయో, ప్రపంచదేశాల్లో చంద్రబాబుకు ఎంత గొప్ప గౌరవం ఉందో పాఠకుడికి ఒక అవగాహన ఏర్పడుతుంది.

ఈరోజో రేపో జగన్‌ ప్రెస్‌మీట్‌పెట్టి చంద్రబాబు లండన్‌వెళ్లి సాధించింది ఏమీ లేదని కాగితాలు ఊపుతూ, గణాంకాలు చెబుతూ సుదీర్ఘంగా ప్రెస్‌మీట్‌ పెడతాడు. జనం జగన్‌ని నమ్మరు. సాక్షితో సహా అన్ని పేపర్లలో అప్పటికే వచ్చిన వార్తలను బట్టి చంద్రబాబునే నమ్ముతారు. అది జగన్‌ ఖర్మ. చంద్రబాబు అదృష్టం.

అప్పుడు కూడా జగన్‌ మన విలేకరి ఎవరైనా చంద్రబాబుతో లండన్‌ వెళ్లి ఆ వార్త రాశారా? లేక చంద్రబాబు విజయాలను ఏకరువుపెడుతూ తెలుగుదేశం పార్టీ పంపిన ప్రెస్‌నోట్‌ను యధావిధిగా రాశారా? అని ఎప్పటికీ అడగడు.

Click on Image to Read:

manmohansingh

ysrcp

reporters

jagan

bjp-president

roja1

photo

jagan-case-involved

bandla-ganesh

kottapalli-geetha

123

trstdpcongress

kcr-kadiyam

jagan-smile-in-assembly

ys-chandrababu