Telugu Global
Others

చరిత్ర తిరగేస్తే... అర్జునుడా? అభిమన్యుడా?

ఈత నేర్చి నదిని ఈదడం సులువే. కానీ నదిలో పడ్డాక ఈత నేర్చుకోవడం సాధ్యమా?. ఆ పరిస్థితి వస్తే చావుబతుకులను సమంగా చూస్తే సంక్షోభమే. అలాంటి పరిస్థితి రాజకీయంగా జగన్ ఎదుర్కొన్నారనే చెప్పాలి. వైఎస్‌ మరణం తర్వాత ఒక్కసారిగా సంక్షోభం చుట్టుముట్టిన పరిస్థితిలో జగన్‌ బయట ప్రపంచానికి పరిచయం అయ్యారు. పావురాల గుట్టలో ఆకట్టుకోలేక పోయిన తొలి ప్రసంగంతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం ఇప్పుడు అసెంబ్లీలోని కొమ్ములు తిరిగిన నేతలకు చెమటలు పట్టేంచే స్థాయికి చేరింది. […]

చరిత్ర తిరగేస్తే... అర్జునుడా? అభిమన్యుడా?
X

ఈత నేర్చి నదిని ఈదడం సులువే. కానీ నదిలో పడ్డాక ఈత నేర్చుకోవడం సాధ్యమా?. ఆ పరిస్థితి వస్తే చావుబతుకులను సమంగా చూస్తే సంక్షోభమే. అలాంటి పరిస్థితి రాజకీయంగా జగన్ ఎదుర్కొన్నారనే చెప్పాలి. వైఎస్‌ మరణం తర్వాత ఒక్కసారిగా సంక్షోభం చుట్టుముట్టిన పరిస్థితిలో జగన్‌ బయట ప్రపంచానికి పరిచయం అయ్యారు. పావురాల గుట్టలో ఆకట్టుకోలేక పోయిన తొలి ప్రసంగంతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం ఇప్పుడు అసెంబ్లీలోని కొమ్ములు తిరిగిన నేతలకు చెమటలు పట్టేంచే స్థాయికి చేరింది.

ఒక తండ్రి అందులోనూ సీఎంగా ఉన్న వ్యక్తి చనిపోతే సదరు కుటుంబంపై మనుషులెవరైనా సానుభూతి చూపుతారు. కానీ జగన్ విషయంలో అలా జరగలేదు. వైఎస్‌ మరణమే అవకాశంగా అమానవీయ దండయాత్రలు మొదలుపెట్టారు. అప్పటి వరకు పెద్దస్థాయిలో ఉన్న‌ నేతల్లో వ్యక్తిగత అవగాహన ఉండేదన్న అభిప్రాయం ఉండేది. ఆమార్గంలోనే బాలకృష్ణ కాల్పులు జరిపినా బయటపడగలిగారు. కానీ జగన్‌ కుటుంబ విషయంలో అలా జరగలేదు. నరకమంటే ఏంటో జగన్‌ కుటుంబానికే కాదు చూస్తున్న ప్రజలకు కూడా అర్థమయ్యే స్థాయిలో సోనియమ్మ నుంచి చంద్రబాబు వరకు పత్రికల నుంచి టీవీ వరకు వేటాడారు. సోనియాతో కాళ్ల బేరానికి దిగి ఉంటే జగన్ సీఎం అయ్యేవారే …

కానీ నాయకుడు మాత్రం అయ్యేవారు కాదు. పదవులిస్తే తెలుగువారు తమ కాళ్ల వద్ద పడి ఉంటారన్న ఢిల్లీబాసుల భావన అలాగే ఉండిపోయేది. ఎన్టీఆర్‌ తర్వాత మళ్లీ తెలుగోడి పౌరుషం దేశానికి చాటిన వ్యక్తి జగనే అనడంలో ఎలాంటి సంశయం అవసరం లేదు. వైసీపీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఉండకపోవచ్చు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎన్నికలకు సిద్ధమా అని వైరిపక్షాన్ని చాలెంజ్‌చేస్తూ ఉండడం వైసీపీ ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో వెంటనే అధికారంలోకి రాకపోతే సదరు పార్టీ మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం. అలాంటి ఉదాహరణలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. కానీ అధికారంలోకి రాలేకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటాడుతున్నా ఐదేళ్లు పాటు ప్రస్తానం సాగించడం అసాధారణమే. దేశం మొత్తం మీదచూసినా జగన్ తరహా నాయకులు కొందరు కనిపించవచ్చు గానీ…

జగన్‌ లాంటి ప్రత్యేక పరిస్థితిలో పార్టీ నడుపుతున్న వారు మాత్రం లేరు. ఒక వైపు కేసులు, మరోవైపు రాజకీయాలను రాజకీయాల కోసమేనడిపే చంద్రబాబులాంటి నేతతో ఢీకొట్టడం సాధారణ నాయకత్వానికి సాధ్యం కాదు. జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మీద వన్‌ టూ వన్ ఫైట్ జరగలేదు. ఎప్పుడూ వైరిపక్షం గుంపుగానే దండయాత్ర చేసింది. చివరకు అసెంబ్లీలో కూడా గుంపు దాడే సాగుతోంది. అంత చేస్తున్నా అసెంబ్లీలో చివరకు అధికార పక్షమే ఆవేశానికి లోనవుతోంది గానీ ప్రతిపక్షం సహనం కోల్పోకపోవడం జగన్‌లోని కొత్త తరహా రాజకీయమే. గతంలో సీఎంగా ఉన్న వైఎస్ నవ్వితే చంద్రబాబు తట్టుకోలేకపోయేవారు. ఇప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నా జగన్ తన నవ్వుతో అధికార పక్షానికి చిరాకు తెప్పిస్తున్నారంటే ఈ కొత్త తరహా వ్యూహరచన భలే అనే చెప్పాలి. పార్టీ పెట్టి ఐదేళ్లు అయినా ఇప్పటికీ అధికారం రాకపోయినా జగన్‌దే భవిష్యత్తు అనిపించుకోగలుగుతున్నారు. ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాల్లో ఉన్నారు.

కానీ వారితో జగన్‌ను పోల్చిచూడలేం. ఎందుకంటే తమ తండ్రులు అధికారపీఠంలో ఉన్నారు కాబట్టి వాళ్లు రాణించగలుతున్నారు. కానీ రాజకీయాల్లో ఓనమాలు తెలియని కుర్రోడు అని అనిపించుకున్న జగన్‌ కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలకంటే గొప్పగా పార్టీని నడపగలుగుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అధికారానికి ఆశపడి టీడీపీలో చేరారు. కానీ దాని వల్ల అధికారపార్టీకి వచ్చిన లాభం కన్నా నష్టమే అధికం. చంద్రబాబు వ్యక్తిత్వాన్నే ఎమ్మెల్యేల ఫిరాయింపు హరించింది. అలా చేయడంలోనూ, రాజధాని భూకుంభకోణాలను వరుసగా బయటపెట్టడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల జోలికి ఇప్పట్లో అధికారపక్షం రాకుండా చేయడం ద్వారా ఆత్మరక్షణ వ్యూహం కూడా విజయవంతంగా అమలు చేశారు. జగన్ తన సలహాలు వినడం లేదన్నది చాలా మంది సీనియర్ల ఫిర్యాదు. కానీ సూటిగా రాజకీయం చేయాలనుకునే వారికి, జనం మనసు గెలిచి పీఠం ఎక్కాలనుకునే నేతలకు పెద్దగా సలహాలు అవసరం లేదు. పైగా రాజకీయజిత్తులకు సంబంధించిన సలహాలు అస్సలు అవసరం లేదు.

బహుశా ఇలాంటి సలహాలు వినకపోవడం వల్లే చాలా మందికి జగన్ నచ్చిఉండకపోవచ్చు. అయినా లీడర్ అన్నాక తనకంటూ ఒక ప్రత్యేకమైన విజన్ ఉండితీరాలి. జగన్ పెద్దల మాట వినిఉంటే అధికారంలోకి వచ్చేవారని కొందరు చెబుతుంటారు. కానీ ఎవరి సలహాలు వినకుండానే జగన్‌ కేవలం 5లక్షల ఓట్ల తేడాతో సీఎం పదవికి దూరంగా నిలిచారన్న వాస్తవం కూడా మరిచిపోకూడదు. చంద్రబాబు తరహాలోనే కొన్ని సాధ్యంకాని హామీలు ఇచ్చి ఉంటే జగన్ సీఎం అయ్యేవారేమో. కానీ భవిష్యత్తు మొత్తం మాటకు విలువలేని వ్యక్తిగా నిలబడాల్సి వచ్చేది. ఒక విధంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడమే జగన్ భవిష్యత్తుకు మంచిదైంది. ఎందుకంటే…

మొన్నటి ఎన్నికల సమయంలో జనం రాజధాని నిర్మాణంతో పాటు పలు అంశాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాటిని రీచ్ అవడం చాలా కష్టం. ఒకవేళ జగన్ గెలిచి ఉంటే ”చూశారా అనుభవం లేని వ్యక్తి చేతిలో రాష్ట్రాన్నిపెట్టడంతో ఎంత నష్టం జరిగిందో… అదే చంద్రబాబు గెలిచి ఉంటే ఈపాటికి నవ్యాంధ్ర రాజధాని అద్భుతంగా పూర్తయ్యేది ” అని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం చంద్రబాబుకే వచ్చింది. ఈయన ఈ ఐదేళ్లలో ఏమాత్రం చేయగలరన్నది ఇప్పటికే అర్థమైంది. ఈమాత్రం దానికి చంద్రబాబే అవసరం లేదన్న భావన జనంలో ఇప్పటికే ఏర్పడింది. ఇది జగన్‌ భవిష్యత్తుకు మంచి చేసే పరిణామమే. మొత్తం మీద చూస్తే అధికారంలోకి రాలేకపోయినా జగన్‌ అర్జునుడే. తండ్రికి తగ్గ తనయుడే. బాబుకు సరైనోడే. కొందరు తలపండిన మేధావులమని తమకుతాముభావించే సీనియర్ పొలిటిషియన్లు చెబుతున్నట్టుగా వైసీపీ కరిగిపోయే మంచు కాదన్నది మాత్రం వాస్తవం.

– రామనాథ్‌ రెడ్డి నార్పల

Click on Image to Read:

manmohansingh

ysrcp

reporters

vijaymalya

ysrcp1

madhupriya

jagan-case-involved

jagan-sakshi

bjp-president

roja1

photo

bandla-ganesh

kottapalli-geetha

123

jagan-smile-in-assembly

kcr-kadiyam

ys-chandrababu

trstdpcongress

First Published:  12 March 2016 7:08 AM GMT
Next Story