Telugu Global
Cinema & Entertainment

అంజ‌లి  ఆ నిజాన్ని దాచ‌లేద‌ట‌..!

తెలుగు హీరోయిన్స్  క‌రువై పోతున్న ఈ రోజుల్లో ..  మంచి అభిన‌యం.. గ్లామ‌ర్ తో రాణిస్తున్న న‌టి   అంజ‌లి.   కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి..అక్క‌డే  స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌రువాత ప‌ర్స‌న‌ల్ ప్రొబ్ల‌మ్ తో .. చెన్నై నుంచి.. హైద‌రాబాద్ కు మాకం మార్చి.. తెలుగు చిత్రాల‌కు  ఎక్కువ  ప్రాధాన్య‌త ఇస్తూ  కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు.  తెలుగులో  మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం సీత‌మ్మ వాకిట్లో  సిరిమ‌ల్లె చెట్టు ఒక రేంజ్ గుర్తింపు తెచ్చింది. […]

అంజ‌లి  ఆ నిజాన్ని దాచ‌లేద‌ట‌..!
X

తెలుగు హీరోయిన్స్ క‌రువై పోతున్న ఈ రోజుల్లో .. మంచి అభిన‌యం.. గ్లామ‌ర్ తో రాణిస్తున్న న‌టి అంజ‌లి. కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి..అక్క‌డే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌రువాత ప‌ర్స‌న‌ల్ ప్రొబ్ల‌మ్ తో .. చెన్నై నుంచి.. హైద‌రాబాద్ కు మాకం మార్చి.. తెలుగు చిత్రాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. తెలుగులో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఒక రేంజ్ గుర్తింపు తెచ్చింది. మ‌హేష్ బాబు.. వెంక‌టేష్ వంటి స్టార్ హీరోల చిత్రం.. టైటిల్ రోల్ త‌నే కావ‌డం .. సినిమా సంక్రాంతి పండ‌గ‌కు రిలీజ్ కావ‌డం.. మంచి ఫ్యామిలీ నేప‌థ్యం ఉన్న క‌థ‌తో చేయ‌డం వెర‌సీ అంజ‌లిని తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ చేసింది. కెరీర్ ప‌రంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్న‌ప్ప‌టికి ప్ర‌స్తుతం స‌క్సెస్ ట్రాక్ మీద ఉంద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇక అస‌లు విష‌యం ఏమిటంటే.. త‌న పై ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా త‌న‌కు ఎవ‌రో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ ప్ర‌తిసారి రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని అంజ‌లి … ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ వుంటే ఎంత కాలం దాచ‌గ‌లం. .. మీడియా వాళ్లు వెతికి మ‌రి ప‌ట్టుకుంటారు క‌దా..! సో త‌న‌కు ఎవ‌రో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ‌నే రూమ‌ర్ ను కొట్టి ప‌డేసింది. క‌రెక్టే క‌దా..! సెలిబ్రిటీల‌కు సంబంధించిన ఏ విష‌య‌మైన క్ష‌ణాల్లో బ‌య‌ట‌కు ఏదో ఒక రూపంలో వ‌స్తున్న ఈ రోజుల్లో… ఒక స్టార్ హీరోయిన్ కు బాయ్ ఫ్రెండ్ వుంటే దొర‌క్కుండా ..బ‌య‌ట‌కు రాకుండా వుండ‌టం అసాధ్యం క‌దా.!

First Published:  13 March 2016 12:14 AM GMT
Next Story